Begin typing your search above and press return to search.

రెచ్చిపోయిన ఖడ్గం బ్యూటీ

By:  Tupaki Desk   |   9 Jun 2018 3:54 PM IST
రెచ్చిపోయిన ఖడ్గం బ్యూటీ
X
చాలా వరకు మోడల్స్ అందరూ హీరోయిన్స్ అవ్వాలనే ప్లాన్ వేస్తారు. మోడలింగ్ దశలోనే అందుకు సిద్దమవ్వడానికి డ్యాన్స్ ను అలాగే నటనను అలవాటు చేసుకుంటారు. కానీ అందరూ అనుకున్నంత స్థాయిలో హీరోయిన్స్ అవ్వలేరు. కొందరు ఉండే తీరును బట్టి క్యారెక్టర్స్ వస్తుంటాయి. మరికొందరికి స్పెషల్ డ్యాన్సుల్లో చేసే అవకాశం వస్తుంది. ఆ విధంగా స్పెషల్ సాంగ్స్ తో ఎక్కువ పాపులర్ అయిన బ్యూటీ కిమ్ శర్మా.

అమ్మడు ఖడ్గం సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన సంగతి తెలిసిందే. ముసుగు వెయ్యొద్దు మనసు మీద అంటూ కుర్ర కారు మనసుల్లో అలా ఫిక్స్ అయ్యింది. ఆ తరువాత మగధీర సినిమాలో అలా కనిపించి వెళ్లిపోయిన కిమ్ మళ్లీ కనిపించలేదు ఏమిటబ్బా అనుకుంటున్నా సమయంలో అమ్మడు ఒక హాట్ ఫోటోతో దర్శనమిచ్చింది. ఏ మాత్రం తగ్గకుండా అప్పటికంటే నాటుగా బికినిలో కనిపించింది.

ఆ ఫోటో చూసే సరికి నెటిజన్స్ తెగ లైక్ కొట్టేస్తున్నారు. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్న కూడా కిమ్ శర్మ గ్లామర్ లో ఏ మాత్రం తగ్గలేదని కామెంట్ చేస్తున్నారు. చూస్తుంటే మరోసారి ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు మరికొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి బయట ఇంతలా రెచ్చిపోయిన కీమ్ తెరమీద తప్పకుండా డోస్ పెంచుతుందనే టాక్ వస్తోంది.