Begin typing your search above and press return to search.

కాక‌లు పుట్టిస్తున్న కుర్ర‌ హీరో ఎఫైర్‌

By:  Tupaki Desk   |   28 Oct 2018 1:30 AM GMT
కాక‌లు పుట్టిస్తున్న కుర్ర‌ హీరో ఎఫైర్‌
X
ముసుగు వెయ్యొద్దు మనసు మీద.. వలలు వెయ్యొద్దు వయసు మీద.. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో .. ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా.. అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా.. మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా... !!?

`ఖ‌డ్గం` సినిమాలోని ఈ పాట‌లానే ఉంటుంది కిమ్‌ శ‌ర్మ బిహేవియ‌ర్‌. ముసుగు వేయ‌డం త‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌ద‌ని ఈ అమ్మ‌డు చాలాసార్లు ప్రూవ్ చేసింది. ఎఫైర్ల ప‌రంగా ఈ హాటీ వ్య‌వ‌హారం ప్ర‌తిసారీ వేడెక్కించే టాపిక్‌. ఖ‌డ్గం సినిమాతో టాలీవుడ్‌ కి ప‌రిచ‌య‌మైన‌ కిమ్‌ శ‌ర్మ ఆ సినిమాలో దేశ‌భ‌క్తుడైన పోలీసాఫీస‌ర్‌ శ్రీ‌కాంత్‌ ని ప్రేమించే యువ‌తిగా న‌టించింది. కృష్ణ‌వంశీ త‌న‌దైన శైలిలో మ‌త్తెక్కించే ఐటెమ్ నంబ‌ర్‌ లో కిమ్ అందాల్ని ఆవిష్క‌రిస్తూ ఐటెమ్‌ని ఎలివేట్ చేశారు. ఆ త‌ర్వాత తెలుగులో న‌టించ‌క‌పోయినా బాలీవుడ్‌ లో మాత్రం కొన్ని అవ‌కాశాల్ని అందిపుచ్చుకుంది. మొహ‌బ్బ‌తే క‌థానాయిక‌గా అక్క‌డ కిమ్‌ కి అంతో ఇంతో ఇమేజ్ ఉంది.

వీట‌న్నిటినీ మించి కిమ్ ప్రేమ వ్య‌వ‌హారాలు అన్నివేళ‌లా హాట్ టాపిక్. కిమ్ శ‌ర్మ ఎఫైర్ జాబితా చిన్న‌దేం కాదు. అప్ప‌ట్లో క్రేజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్‌ తో ఎఫైర్ సాగించిన ఈ సుంద‌రి - అటుపై పెళ్ల‌యిన డిజైన‌ర్ అర్జున్ ఖ‌న్నాతోనూ ఘాటైన ఎఫైర్ సాగించింది. ఆ త‌ర్వాత బిజినెస్‌ మేన్ అలీని పెళ్లాడి అత‌డికి చాలా త‌క్కువ టైమ్‌ లోనే విడాకులిచ్చింది. ప్ర‌స్తుతం కుర్ర‌హీరో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ తో ఎఫైర్ సాగిస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఆ ఇద్ద‌రూ ఒక‌రంటే ఒక‌రు వీడ‌లేనంత సాన్నిహిత్యాన్ని కొన‌సాగిస్తుండ‌డం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ జంట‌ షికార్లు చేస్తున్న ఫోటోలు, ఒకే స్కూట‌ర్‌ పై రైడ్‌కి వెళుతున్న ఫోటోలు ఆన్‌ లైన్‌ లో వేడి పెంచుతున్నాయి. కిమ్- హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ జోడీ ఇటీవ‌లే రిలీజైన‌ పాల్తాన్ చిత్రంలో న‌టించారు. అప్ప‌టినుంచి ఈ స్నేహం అలా కొన‌సాగుతూనే ఉంది. ఎఫైర్ వేడెక్కిస్తోంద‌న్న‌ది బాలీవుడ్ టాక్. త‌న‌కంటే వ‌య‌సులో పెద్ద‌దిగా ఉండే అమ్మ‌డితో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఇలా చెట్టాప‌ట్టాల్ అంటూ తిరిగేయ‌డం అంతే దుమారం రేపుతోంది.