Begin typing your search above and press return to search.

నిరంతర నగ్న సెల్ఫీలతో పిచ్చెక్కిస్తానంటున్న కిమ్

By:  Tupaki Desk   |   18 May 2016 8:27 AM GMT
నిరంతర నగ్న సెల్ఫీలతో పిచ్చెక్కిస్తానంటున్న కిమ్
X
న్యూడ్ ఫొటోల స్పెషలిస్టు - హాలీవుడ్ రియాల్టీ స్టార్‌ కిమ్‌ కర్దాషియన్‌ తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తన నగ్న ఫొటోలు ఎప్పుడైనా ఆగిపోతాయని ఎవరూ భయపడాల్సిన పని లేదని... తాను మరణించేవరకు కూడా తన నగ్న చిత్రాలను అభిమానుల కోసం పోస్టు చేస్తుంటానని ప్రకటించేసింది. నగ్న సెల్ఫీలతో పాపులర్ అయిన ఈ కత్తిలాంటి భామ చేసిన ప్రకటనతో ఆమె అభిమానులు తెగ సంతోషిస్తున్నారట. సోషల్ మీడియాలో తమ అభిమాన సుందరి అందాన్ని తనివితీరా చూసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని ఆనందిస్తున్నారట.

ముప్ఫయి అయిదేళ్ల వయసులో మత్తెక్కించే కళ్లతో మతి పోగొట్టే ఫిగర్ తో ఉండే కిమ్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇటీవల "బ్రేక్‌ ద ఇంటర్నెట్‌" అవార్డు అందుకున్న ఆమె ఆ సందర్భంగా మాట్లాడుతూ. అభిమానుల కోసం తన జీవితాంతం ఇలాగే తన నగ్న సెల్ఫీలు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని తెలిపింది. నగ్నంగా సెల్ఫీలు దిగడం ఈ భామకు కొత్తకాదు. గత ఏడాది తన నగ్న సెల్ఫీని సోషల్‌ మీడియాలో పోస్టుచేసి. కిమ్ పెద్ద దమారమే రేపింది. ఆమె చర్యను పలువురు తప్పుబట్టగా. మరికొందరు హాలీవుడ్ సినీ స్టార్లు మాత్రం తాము కూడా కిమ్ మార్గాన్ని అనుసరించారు. తమ న్యూడ్‌ సెల్ఫీలను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ మ్యానియా సినీ తారలతోనే ఆగిపోలేదు. ఇంకా కొందరు మహిళలు కూడా కిమ్‌ దారిలోనే తమ టాప్ లెస్ సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఇలా నగ్న సెల్ఫీల ట్రెండ్ ను సృష్టించిన కిమ్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా శృంగార ప్రియులను సంతోషింపచేస్తోంది.

అయితే... కొందరు వాస్తవవాదులు మాత్రం దీనిపై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే 35లోకి వచ్చేసిన కిమ్ ఇంకా ముసలైతే ఆమె న్యూడ్ సెల్ఫీలు ఎవరు చూస్తారని అంటున్నారు. ఇప్పుడైతే మంచి ఫిగర్ మెంటైన్ చేస్తుంది కాబట్టి చూస్తున్నారని.. జీవితకాలమంతా ఆమె ఇలాగే న్యూడ్ ఫొటోలు షేర్ చేస్తే ఎవరూ చూడరని చెబుతున్నారు.