Begin typing your search above and press return to search.

ఆమె న్యూడ్‌ పోస్టర్లు అమ్ముతున్నారట..

By:  Tupaki Desk   |   17 Jun 2016 5:41 AM GMT
ఆమె న్యూడ్‌ పోస్టర్లు అమ్ముతున్నారట..
X
హాలీవుడ్ భామ కిమ్ కర్దాషియాన్ డేరింగ్ - గట్స్.. ఇలాంటి వాటికి కేరాఫ్ అడ్రస్ గా అనిపిస్తుంది. సినిమాల కంటే.. టెలివిజన్ సిరీస్ ల్లోనే ఈ భామ బాగా ఫేమస్. అయినా సరే ఏ హాలీవుడ్ హీరోయిన్ కి తీసిపోని క్రేజ్ కిమ్ సొంతం. కింబర్లీ నోయెల్ కర్దాషియన్ ఈమె పూర్తి పేరు కాగా.. ఫాలోయింగ్ విషయంలో కొత్త సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు జీక్యూ మేగజైన్ కోసం.. కిమ్ ఇచ్చిన న్యూడ్ - సెమీ న్యూడ్ ఫోటో షూట్ వైరల్ అయిపోతోంది.

బెడ్ మీద న్యూడ్ తో బజ్జోవడం - ఒంటిమీద నూలుపోగు లేకుండా మెట్లెక్కి నడవడం - అందాలన్నీ రివీల్ చేస్తూ ఔట్ ఫిట్స్.. ఇలా చెప్పాలంటే మేగజైన్ మొత్తంలో కిమ్ కేకలు పెట్టించేసింది. అసలు కవర్ పేజ్ పైనే కోట్ ను అడ్డం పెట్టుకుని ఇచ్చిన ఫోజ్ అభిమానులను వెర్రెత్తించేసింది. 'గతంలో మీరెన్నడూ చూడని విధంగా కిమ్' అనే ట్యాగ్ లైన్ చాలు.. ఏ రేంజ్ లో ఈ భామ అందాలు పరిచేసిందో అర్ధం చేసుకోవడానికి.

ఇక మొత్తం ఫోటోలన్నిటిలోనూ హైలైట్ ఏంటంటే.. కిమ్ వయ్యారంగా గడ్డిలో పడుకుని న్యూడ్ గా ఇచ్చిన ఫోటోగ్రాఫ్. దాన్ని మాత్రం కొంచెం సీక్రెట్ గా ఉంచి.. దానికి సంబంధించిన పోస్టర్ సైజ్ ప్రింట్స్ అమ్ముతున్నామని, అది కూడా లిమిటెడ్ క్వాంటిటీ మాత్రమేనని జీక్యూ అనౌన్స్ చేసింది. దీంతో ఈ న్యూడ్ ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఏమైనా ముగ్గురు భర్తలను మార్చిన తర్వాత.. ఇద్దరు పిల్లలను కన్న తర్వాత.. ఈ రేంజ్ లో పోజులిచ్చిందంటే.. కిమ్ కర్దాషియన్ కేక అంతే.