Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: స‌్పైడ‌ర్ మ‌త్స్య క‌న్య‌

By:  Tupaki Desk   |   7 May 2019 5:43 AM GMT
ఫోటో స్టోరి: స‌్పైడ‌ర్ మ‌త్స్య క‌న్య‌
X
న్యూయార్క్ వేదిక‌గా జ‌రుగుతున్న మెట్ గాలా -2019 ఈవెంట్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన‌ వ‌య్యారి భామ‌ల హంస‌న‌డ‌క‌ల‌తో వ‌ర్ణ రంజితం అయిన సంగతి తెలిసిందే. భామ‌లు హంస‌న‌డ‌క‌ల‌తో పింక్ కార్పెట్ ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్నారు. ఇప్ప‌టికే ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ జంట ఈ వేడుక‌లో హొయ‌లు పోయిన తీరు.. ఆ డ్రెస్ కోడ్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక ఇదే వేదిక‌పై ఆ జంట‌కు పోటీగా మ‌రో హాట్ పెయిర్ వేడెక్కించింది.

ఇంత‌కీ ఎవరా జోడీ? అంటే... ది గ్రేట్ కిమ్ క‌ర్ధాషియ‌న్ - కాన్యే వెస్ట్ జంట `మెట్ గాలా ఈవెంట్` ని వేడెక్కించారు. న‌టుడు కాన్యే వెస్ట్ బ్లాక్ క‌ల‌ర్ సూట్ లో క‌నిపించ‌గా.. కిమ్ క‌ళ్లు చెదిరే డిజైన‌ర్ వేర్ లో త‌ళుకులీనింది. కిమ్ ధ‌రించిన డ్రెస్ విష‌యంలో ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఈ వేడుక‌లో కిమ్ క‌ర్ధాషియ‌న్ రూపం ఉలి వేసి చెక్కిన అపురూప‌ శిల్పంలా క‌నిపించింది. పాక్షికంగా అందాల్ని ఎలివేట్ చేస్తూనే.. శ‌రీర ఛాయ‌లో క‌లిసిపోయే స్పెష‌ల్ డిజైన‌ర్ డ్రెస్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఆ ఎద అందాలు స‌హా అంగ సౌష్ట‌వ ప్ర‌ద‌ర్శ‌న‌పైనే కిమ్ దృష్టి సారించింది. బిగి అందాల‌పై ఆయిల్ మెరుపులు ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఈ లుక్ ని `వెట్ అండ్ డ్రిప్పింగ్ లుక్` అని పిలుస్తున్నారు. బిస్కెట్ క‌ల‌ర్ డిజైన‌ర్ డ్రెస్ లుక్ కాస్తంత స్పైడ‌ర్ డిజైన్ తో ఆక‌ట్టుకుంది. అలాగే కిమ్ తీర్చిదిద్దిన రూపం చూడ‌గానే మ‌త్స్యాన్ని త‌ల‌పిస్తోంది. ఇక ఆ డ్రెస్ పై క్రిస్ట‌ల్స్ అద్దిన తీరు ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తోంది.

న్యూయార్క్ మెట్రో పాలిట‌న్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ ప్ర‌తియేటా ఈ వేడుక‌ల్ని నిర్వ‌హిస్తుంటుంది. ఇక్క‌డ ప‌లు దేశాల నుంచి వ‌చ్చిన సెల‌బ్రిటీలు త‌మ ఫ్యాష‌న్స్ ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ప్ర‌త్యేకించి డిజైన‌ర్ డ్రెస్ లు.. డిజైన‌ర్ లుక్ పై ఫోక‌స్ చేసే ఈవెంట్ ఇది. అందుకే దీపిక‌.. పీసీ.. కిమ్.. వంటి భామ‌లు అదిరిపోయే డిజైప‌ర్ డ్రెస్ ల‌తో ఇక్క‌డ దిగిపోయార‌న్న‌మాట‌.