Begin typing your search above and press return to search.

కిలో మీటరు పొడవైన సెట్టింగ్‌

By:  Tupaki Desk   |   15 Feb 2021 10:11 AM IST
కిలో మీటరు పొడవైన సెట్టింగ్‌
X
ఒకప్పుడు సినిమా కోసం కోటి రూపాయలు పెట్టి సెట్‌ వేస్తే బాబోయ్‌ అనే వారు. కాని ఇప్పుడు సినిమా భారీతనం కోసం పదుల కోట్లు పెట్టి సెట్టింగ్ లు వేయిస్తున్నారు. సినిమా కథలో కీలకం అనుకుంటే ఆ సెట్టింగ్‌ కోసం నిర్మాతలు దర్శకులు ఎంత ఖర్చు పెట్టేందుకు అయినా కూడా వెనకాడటం లేదు. ఇంత భారీ సెట్టింగ్‌ ల నిర్మాణం ముఖ్యంగా టాలీవుడ్‌ మరియు బాలీవుడ్‌ సినిమాల కోసం జరుగుతున్నాయి. టాలీవుడ్‌ కు భారీ సెట్టింగ్ లను గుణ శేఖర్‌ పరిచయం చేశాడు. రాజమౌళి ఏ రేంజ్ లో సెట్టింగ్‌ లను వేయిస్తున్నాడో చెప్పుకోనక్కర్లేదు. ఇక దేశం మొత్తం ఆశ్చర్యంగా చూసే విధంగా 'ఓమ్‌' సినిమా కోసం బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కపిల్ వర్మ కిలోమీటరు దూరం ఉండే సెట్టింగ్‌ ను వేయించాడు.

బాలీవుడ్‌ స్టార్‌ ఆదిత్య రాయ్ కపూర్‌ హీరోగా కపిల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్‌ డ్రామా 'ఓమ్‌' కోసం ఈ సెట్టింగ్ ను నిర్మించారని తెలుస్తోంది. కిలో మీటరు పొడవు ఉండే సెట్టింగ్‌ అంటే ఎలా ఉంటుందో ఊహించేసుకోండి. ఎలా వేశారు ఎంత బడ్జెట్‌ తో వేశారు అనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి అయితే జాతీయ మీడియాలో ఈ సెట్టింగ్‌ గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. ఈ సెట్టింగ్ తో సినిమా రేంజ్ ను పెంచేశారు అంటూ సినీ వర్గాల వారు మరియు అభిమానులు అంటున్నారు.