Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్‌: టైటానిక్ హీరో ఆస్కార్ డైరెక్ట‌ర్ తో ప్ర‌యోగం

By:  Tupaki Desk   |   19 May 2023 2:00 PM GMT
ట్రైల‌ర్ టాక్‌: టైటానిక్ హీరో ఆస్కార్ డైరెక్ట‌ర్ తో ప్ర‌యోగం
X
టైటానిక్ హీరో డికాప్రియో 'ఇన్ సెప్ష‌న్' లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో అద్భుతంగా న‌టించాడు. ఆస్కార్ విన్నింగ్ సినిమాల్లో అత‌డు హీరో. ఇటీవ‌ల‌ ఆస్కార్ ల‌తో సంచ‌ల‌నాలు సృష్టించిన‌ పాపుల‌ర్ డైరెక్ట‌ర్ మార్టిన్ స్కోర్సెస్ తో క‌లిసి వ‌రుస చిత్రాల‌కు ప‌ని చేసాడు. గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్- ఏవియేషన్- ది ఆడిషన్ -ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ తర్వాత స్కోర్సెస్ - డికాప్రియో మ‌రో భారీ ప్ర‌యోగం చేస్తున్నారు.

త‌దుప‌రి ఈ జోడీ నుచి భారీ అంచనాల న‌డుమ విడుద‌ల‌వుతున్న చిత్రం 'కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్'. తాజాగా మేకర్స్ మొదటి టీజర్ ను విడుదల చేశారు. లియోనార్డో డికాప్రియో -రాబర్ట్ డెనిరో ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్లలోకి రానుంది.

అమెరికా ఆధారిత మీడియా అవుట్ లెట్ డెడ్ లైన్ ప్రకారం- ఆపిల్ ఒరిజినల్ ఫిల్మ్స్ డ్రామా 'కిల్ల‌ర్స్ ఆఫ్ ది ఫ్ల‌వ‌ర్ మూన్' శనివారం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రపంచ ప్రీమియర్ ను ప్రదర్శించ‌నున్నారు. 6 అక్టోబర్ 2023న ఎంపిక చేసిన థియేటర్ లలో విడుద‌ల చేస్తారు. అటుపై అక్టోబర్ 20న ఇత‌ర మార్కెట్ల‌లో విడుద‌ల‌వుతుంది. తర్వాత Apple TV+లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కు వెళుతుంది.

ఒక నిజకథ ఆధారంగా బుర్కార్ట్ (లియోనార్డో డికాప్రియో) - మోలీ మధ్య రొమాన్స్ ద్వారా సినిమా నేరేష‌న్ కొన‌సాగ‌నుంది. కైల్ (లిల్లీ గ్లాడ్ స్టోన్).. కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ అనేది ఇతిహాసమైన పాశ్చాత్య క్రైమ్ సాగా. నిజమైన ప్రేమ ఏదో చెప్పలేని ద్రోహుల క‌థ‌ను తెర‌పై చూపిస్తున్న తీరు ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ట్రైల‌ర్ ఆద్యంతం ఏదో మ‌ర్మం ఆక‌ర్షిస్తుంది.

సస్పెన్స్ థ్రిల్ల‌ర్ ఎలిమెంట్ గ‌గుర్పాటున‌కు గురి చేస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో లిల్లీ గ్లాడ్ స్టోన్,.. జెస్సీ ప్లెమోన్స్,.. కారా జేడ్ మైయర్స్,.. జానే కాలిన్స్,.. జిలియన్ డియోన్ .. టాంటూ కార్డినల్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుద‌లైన టీజ‌ర్ లో చివ‌రి ప్ర‌శ్న‌.. ఆ గుంపులో తోడేళ్లు ఎవ‌రో క‌నిపెట్ట‌గ‌ల‌రా? .. ఈ ప్ర‌శ్న‌తో థీమ్ ఏంటో అర్థ‌మ‌వుతోంది.

నెట్ ఫ్లిక్స్ సెటైరిక‌ల్ డ్రామా 'డోంట్ లుక్ అప్‌' లో లియోనార్డో చివరిగా కనిపించాడు. ఈ చిత్రం సానుకూల సమీక్ష‌ల‌ను అందుకుంది. ఇందులో జెన్నిఫర్ లారెన్స్- రాబ్ మోర్గాన్ - జోనా హిల్ కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు. మరోవైపు స్కోర్సెస్ చివరిగా రాబర్ట్ డి నీరో ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ది ఐరిష్ మన్ కి దర్శకత్వం వహించాడు.