Begin typing your search above and press return to search.

వసూళ్లు మాత్రం డబుల్ ‘కిక్’ ఇచ్చాయి

By:  Tupaki Desk   |   22 Aug 2015 6:01 PM IST
వసూళ్లు మాత్రం డబుల్ ‘కిక్’ ఇచ్చాయి
X
కిక్-2 సినిమా డివైడ్ టాక్ తో మొదలైంది. రవితేజ ఎనర్జీని ఇష్టపడేవాళ్లు కిక్-2తో శాటిస్ఫై అయిపోతున్నారు. ఐతే కథాకథనాల విషయంలో నిరాశ తప్పకపోవడంతో నెగెటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. సినిమా అసలు సత్తా ఏంటన్నది సోమవారానికి గానీ తెలియదు. ఐతే ఓపెనింగ్స్ విషయంలో మాత్రం కిక్-2 దుమ్ము దులిపేసింది. తొలి రోజు వసూళ్లలో రవితేజ కెరీర్ రికార్డు చెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. షేర్ రూ.7.2 కోట్ల దాకా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ.6 కోట్ల దాకా షేర్ వచ్చినట్లు సమాచారం. రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ షేర్స్ కోటి రూపాయలకు పైనే ఉన్నాయి.

రవితేజ గత సినిమా ‘పవర్’ తొలి రోజు రూ.5.5-6 కోట్ల మధ్య షేర్ కలెక్ట్ చేసింది. ఐతే దాంతో పోలిస్తే కిక్-2ను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. దీనికి హైప్ కూడా ఎక్కువే ఉంది. శని, ఆదివారాలకు కూడా ఇప్పటికే బుకింగ్స్ అయిపోయాయి కాబట్టి.. తొలి మూడు రోజుల్లోనే కిక్-2 రూ.17-18 కోట్ల మధ్య షేర్ కలెక్ట్ చేసే అవకాశముంది. ఐతే బ్రేక్ ఈవెన్ కు రావాలంటే ఇంకో పది కోట్లకు పైనే కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది. సోమవారం కలెక్షన్లు ఎంతమేరకు డ్రాప్ అవుతాయన్నది ముఖ్యం. మేజర్ డ్రాప్ లేకుంటే తర్వాతి వీకెండ్ కు మళ్లీ పుంజుకోవచ్చు. వచ్చేవారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం కిక్-2కు కలిసొచ్చే అంశం. ఐతే శ్రీమంతుడు ఇంకా స్ట్రాంగ్ గా ఉండటమే కిక్-2కు మైనస్ అయ్యే అవకాశముంది.