Begin typing your search above and press return to search.

దెబ్బ పడేది రుద్రమదేవికా, కిక్‌-2కా?

By:  Tupaki Desk   |   8 Jun 2015 9:30 AM GMT
దెబ్బ పడేది రుద్రమదేవికా, కిక్‌-2కా?
X
ఎవరి కారణాలు వాళ్లవి. మొత్తానికి బంగారం లాంటి సమ్మర్‌ సీజన్‌ను వేస్ట్‌ చేశారు. బాహుబలి విషయంలో ఏం జరుగుతోందో స్పష్టత ఉంది కాబట్టి.. అది వాయిదా పడటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ రుద్రమదేవికి ఏమైందో, కిక్‌-2కు ఏమైందో? ఏదో కారణాలతో ఈ రెండు సినిమాల విడుదలను వెనక్కి తోస్తూ తోస్తూ పోయారు. ఇప్పుడు ఈ రెండింట్లో ఏదో ఒక సినిమాకు పెద్ద దెబ్బ పడనుంది.

గత నెలలోనే రావాల్సిన కిక్‌-2ను ఇంకో వారం ఇంకో వారం అంటూ వెనక్కి తోసుకుంటూ వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 19న ఖాయం అన్నారు కానీ.. పరిస్థితి చూస్తుంటే ఆ డేటు కూడా డౌటే అన్నట్లుంది. 26వ తేదీ గురించి ఆలోచిస్తుంటే.. సడెన్‌గా గుణశేఖర్‌ ఊడిపడ్డాడు. రుద్రమదేవి డేట్‌ ఇచ్చేశాడు. ఐతే 26 దాటిందంటే ఇక చాలా కష్టం. జులై 10న 'బాహుబలి' రెడీగా ఉంది. ఆ తర్వాతి వారానికో, రెండు వారాలకో శ్రీమంతుడు వస్తాడు.

అంటే 26 మిస్సయితే కనీసం నెల రోజులు ఆగాలి. ముందుగా డేట్‌ ఇచ్చాడు కాబట్టి గుణశేఖర్‌కే 26వ తేదీ మీద హక్కులుంటాయి. కిక్‌-2 పోటీకి వచ్చిందంటే ఆ సినిమాకూ దెబ్బే. 'రుద్రమదేవి' మీద ఎఫెక్ట్‌ మామూలుగా ఉండదు. అసలే కష్టాల్లో ఉన్న గుణశేఖర్‌కు పోటీ ఎదురైందంటే మాత్రం ఆర్థికంగా దారుణమైన దెబ్బ పడుతుంది. అలాగని 26వ తేదీని వదులుకుంటే ఇంకో నెల రోజులకు పైగా విడుదల కోసం ఆగాలి. మరి రుద్రమదేవి, కిక్‌-2 సినిమాల్లో దేనికి దెబ్బ పడబోతోందో చూడాలి.