Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ లో విల్లా కొన్న కన్నడ స్టార్‌

By:  Tupaki Desk   |   9 Dec 2020 4:00 PM IST
హైదరాబాద్‌ లో విల్లా కొన్న కన్నడ స్టార్‌
X
కన్నడ స్టార్‌ హీరో.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయిన సుదీప్‌ రెగ్యులర్‌ గా హైదరాబాద్‌ కు వచ్చి పోతూ ఉంటాడు. తెలుగు సినిమాల్లో నటించడంతో పాటు కన్నడ సినిమాల షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ కు తరచు వస్తున్న సుదీప్‌ ప్రతి సారి హోటల్‌ లో ఉండటం.. లేదంటే మరో చోట ఉండటం కాస్త ఇబ్బందిగా ఉందట. అందుకే హైదరాబాద్‌ లో ఒక ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. గచ్చిబౌలి లోని ఒక విశాలమైన గేటెడ్‌ కమ్యూనిటీలో ఈయన విల్లా కొనుగోలు చేశాడని వార్తలు వస్తున్నాయి.

ఈ విల్లాను ఒక తెలుగు సినీ ప్రముఖుడు సుదీప్‌ కు ఇప్పించాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈయన పలు కన్నడ సినిమాలతో పాటు ఒక తెలుగు సినిమాలో కూడా నటించబోతున్నాడు. ఇటీవలే సుదీప్‌ హైదరాబాద్‌ లో షూటింగ్‌ కోసం వచ్చాడు. ఆ సమయంలోనే ఈ విల్లాకు సంబంధించిన చర్చలు జరిగాయనే వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌ లో ఆస్తుల కొనుగోలు చేయడం అనేది లాభదాయకమైన వ్యాపారం అనేది చాలా మంది అభిప్రాయం. వ్యాపారం రీత్యా కూడా సుదీప్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు అంటున్నారు.