Begin typing your search above and press return to search.

మెగాస్టార్ తో ప‌దేళ్లకు ఈ ఛాన్స్‌

By:  Tupaki Desk   |   16 March 2019 8:35 AM GMT
మెగాస్టార్ తో ప‌దేళ్లకు ఈ ఛాన్స్‌
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `సైరా - న‌ర‌సింహారెడ్డి` అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. చిత్ర క‌థానాయ‌కుడు .. ఎంచుకున్న‌ క‌థాంశం.. బ‌డ్జెట్ .. ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ .. కాస్టింగ్ వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల దృష్ట్యా ఈ సినిమా 2019-20 సీజ‌న్ మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాలో చేరిందన‌డంలో ఎలాంటి సందేహాలు లేవు. టాలీవుడ్ నుంచి ఆర్.ఆర్.ఆర్ - సాహో చిత్రాల‌కు ధీటుగా మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న `సైరా` పేరు మార్మోగిపోతోంది. గ‌త కొంత‌కాలంగా సైరా టీమ్ సైలెంట్ గా ఉన్నా మెగాభిమానుల్లో మాత్రం ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌తి అప్ డేట్ ని మీడియా ప్ర‌ధానంగా ప్ర‌చారం చేసింది. టీజ‌ర్ - పోస్ట‌ర్ల‌తోనే సైరా టీమ్ జాతీయ స్థాయిలో ప్ర‌ముఖుల దృష్టిని ఆక‌ర్షించింది.

అందుకే ఈ చిత్రంలో ప్ర‌తి పాత్ర‌కు సంబంధించిన డీటెయిలింగ్ పై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. తాజాగా కిచ్చా సుదీప్ త‌న ఇన్ స్టాగ్ర‌మ్‌ లో ఓ ఫోటోని లీక్ చేశారు. ఈ ఫోటోలో బిగ్ బి అమితాబ్ తో క‌లిసి సుదీప్ క‌నిపించారు. గుబురు గ‌డ్డం.. కోర మీసాల‌తో అమితాబ్ స్ఫుర‌ద్రూపం మైమ‌రిపించింది. పూర్వ కాలంలో క‌ఠోర త‌ప‌స్సును ఆచ‌రించిన మునీశ్వ‌రుల స్ఫుర‌ద్రూప‌మిది. ఆ ప‌క్క‌నే సుదీప్ అల్ట్రా మోడ్ర‌న్ లుక్ లో క‌నిపించాడు. అంటే ఈ సినిమా రికార్డింగ్ వ‌గైరా కార్య‌క్ర‌మాల్లోని ఫోటో ఇద‌ని అర్థ‌మ‌వుతోంది. ``ర‌ణ్‌` త‌ర్వాత‌ ప‌దేళ్ల‌కు ఇలా లెజెండ్ అమితాబ్ తో క‌లిసి తెర‌ను పంచుకునే భాగ్యం క‌లిగింది. అందుకు కార‌కులైన రామ్ చ‌ర‌ణ్‌- సురేంద‌ర్ రెడ్డి టీమ్కి ధ‌న్య‌వాదాలు. థాంక్యూ అమితాబ్ బ‌చ్చ‌న్ స‌ర్... మీ ప్రేమాభిమానాల‌కు సంతోషంగా ఉంది`` అని సుదీప్ వ్యాఖ్యానించారు.

వాస్త‌వానికి బిగ్ బి రోల్ గురించి ఆయ‌న 76వ‌ బ‌ర్త్ డే రోజున సైరా టీమ్ ఓ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి రాజ‌గురువు అయిన గోసాయి వెంక‌న్న పాత్ర ఇద‌ని రివీల్ చేశారు. ఆ పాత్ర‌కు అమితాబ్ 200 శాతం యాప్ట్ అయ్యార‌ని మెగాభిమానుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇప్ప‌టికే సైరా న‌ర‌సింహారెడ్డి మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. మ‌రోవైపు సైమ‌ల్టేనియ‌స్ గా నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి.