Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ గురించి కన్నడ సూపర్‌ స్టార్‌ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   4 Aug 2021 5:30 AM GMT
ఎన్టీఆర్‌ గురించి కన్నడ సూపర్‌ స్టార్‌ కామెంట్స్‌
X
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానుల సంఖ్య భారీగా ఉంటుంది. టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరోల్లో ఎన్టీఆర్‌ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. చిన్న వయసులోనే ఎన్నో ఇండస్ట్రీ రికార్డులను దక్కించుకున్న ఘనత ఆయనది. అలాంటి ఎన్టీఆర్‌ కు సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఎంతో మంది సెలబ్రెటీలు కూడా ఆయనకు అభిమానులుగా ఉన్నారు అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్‌ సెలబ్రెటీ అభిమానుల సంఖ్య పెరుగుతూను ఉంది. తాజాగా కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చ సుదీప్‌ ఒక ఇంటర్వ్యూలో తనకు టాలీవుడ్‌ హీరోలో అత్యధికంగా నచ్చే హీరో ఎన్టీఆర్‌ అన్నాడు. ఎన్టీఆర్‌ కు సంబంధించిన ప్రతి విషయం పట్ల సుదీప్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ క్లిప్‌ ను నందమూరి అభిమానులు సోషల్‌ మీడియాలో తెగ షేర్‌ చేస్తున్నారు.

టాలీవుడ్‌ హీరోల్లో ఎన్టీఆర్‌ అంటే చాలా ఇష్టం అంటూ వ్యాఖ్యలు చేసిన సుదీప్‌.. ఆయన కష్టపడే తీరు చాలా బాగా నచ్చుతుంది. ఆయనతో కలిసి వర్క్ చేయడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఆయన అద్బుతంగా నటిస్తాడు. ఆయనలాంటి వారితో చేయడం వల్ల తోటి నటీ నటులకు కూడా ఛాలెంజింగ్ గా ఉంటుంది.. చాలా నేర్చుకునేలా కూడా ఉంటుందని సుదీప్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. భీమ్‌ పాత్ర కోసం అతడు మారిన తీరు అద్బుతం అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. చబ్బీ చబ్బీ గా ఉండే ఎన్టీఆర్ ఇప్పుడు అద్బుతమైన ఫిజిక్ తో భీమ్‌ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తప్పకుండా కొమురం భీమ్‌ గా ఎన్టీఆర్‌ సక్సెస్ దక్కించుకుంటాడు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశాడు.

ఎన్టీఆర్‌ గురించి గతంలో పలువురు స్టార్స్ వ్యాఖ్యలు చేసినా.. ఈసారి ఎన్టీఆర్‌ గురించి సుదీప్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. కన్నడంలో ఎన్టీఆర్‌ కు మరింత ఇమేజ్ ను పెంచే విధంగా సుదీప్‌ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్‌ విదేశాల్లో సాగుతోంది. అతి త్వరలోనే చిత్ర యూనిట్‌ సభ్యులు ఇండియాకు తిరిగి రాబోతున్నారు.

ఎన్టీఆర్‌ ఈ నెలలో జెమిని టీవీలో ప్రసారం కాబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో తో ప్రేక్షకులమ ఉందుకు రాబోతున్నాడు. ఇక ఎన్టీఆర్‌ ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ను అక్టోబర్ లో దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్‌ మరియు కొరటాల శివ కాంబోలో సినిమా పట్టాలెక్కబోతుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యింది. త్వరలోనే సినిమా షూటింగ్‌ ను కూడా ప్రారంభించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఎన్టీఆర్‌ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాలో కొమురం భీమ్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పాత్రతో ఎన్టీఆర్‌ పాన్ ఇండియా స్టార్‌ గా ఎదగడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చాలా నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం సినిమాకు ఇతర భాషల్లో కూడా మంచి బజ్ ఉంది. అలాగే సినిమా ఇతర దేశాల్లో కూడా సినిమా ను విడుదల చేయబోతున్నారు. కనుక ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో పాన్ వరల్డ్‌ స్టార్ గా కూడా ఎన్టీఆర్‌ గుర్తింపు దక్కించుకుంటాడని ఎన్టీఆర్‌ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. బుల్లి తెరపై కూడా ఎన్టీఆర్‌ రికార్డ్‌ ను నమోదు చేసేందుకు సిద్దం అవుతున్నాడు అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.