Begin typing your search above and press return to search.

వివాదాల హీరోయిన్ ని వెన‌కేసుకొస్తున్న హీరో?!

By:  Tupaki Desk   |   2 Jan 2023 2:30 AM GMT
వివాదాల హీరోయిన్ ని వెన‌కేసుకొస్తున్న హీరో?!
X
ఏదో ఒక నెగెటివ్ కామెంట్ తో ఇటీవ‌లి కాలంలో యువ‌హీరోయిన్ రష్మిక మంద‌న్న హెడ్ లైన్స్ లోకి వ‌స్తోంది. ఇంత‌కుముందే ..కాంతారా సినిమాని తాను చూడ‌లేద‌ని ఓపెన్ గా చెప్పి వివాదంతో అంట‌కాగింది. ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ పై ఆ కామెంట్ రిష‌బ్ శెట్టి (ర‌క్షిత్ శెట్టి క‌జిన్) అభిమానుల‌కు రుచించ‌లేదు. అంతకుముందు సౌత్ లో స‌రైన రొమాంటిక్ సాంగ్స్ మిస్స‌వుతున్నాయ‌ని.. మ‌సాలా పాట‌ల‌కు ప్రాధాన్య‌త‌నిస్తార‌ని బ‌హిరంగంగా వ్యాఖ్యానించింది. కార‌ణం ఏదైనా ఇలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ర‌ష్మిక సోష‌ల్ మీడియాల్లో బిగ్ డిబేట్ కి తావిస్తోంది. ప‌నిలో ప‌నిగా ల‌క్ష‌లాదిగా ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ ని కూడా పెంచుకుంటోంది.

2017లో ర‌క్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్న రష్మిక మందన్న ఆ త‌ర‌వాత పెళ్లిని రద్దు చేసుకుంది. అకార‌ణంగా ర‌ష్మిక ఇలా చేసింద‌ని భావించిన శెట్టి బ్ర‌ద‌ర్స్ అభిమానులు సోషల్ మీడియాల‌లో విరుచుకుప‌డ్డారు. రక్షిత్ శెట్టి అభిమానులు ర‌ష్మిక‌ను శ‌త్రువుగా చూసారు. తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో క‌న్న‌డ స్టార్ హీరో.. కిచ్చా సుదీప్ ర‌ష్మిక మంద‌న్న‌కు అండ‌గా నిలిచాడు. త‌న‌ని స‌మ‌ర్థిస్తూ ఆ నిర్ణ‌యం స‌రైన‌దా కాదా? అన్న‌ది అటుంచితే ఇలా కించ‌ప‌ర‌చ‌డం స‌రికాద‌ని ర‌క్షిత్ అభిమానుల‌ను అదుపుత‌ప్ప‌కుండా ఆపే ప్ర‌య‌త్నం చేశాడు. ఆ త‌ర్వాత ర‌ష్మిక మంద‌న సైతం సుదీప్ ఎంతో గొప్ప ర‌క్ష‌కుడిగా ఉండే స‌హ‌న‌టుడు అంటూ కితాబిచ్చేసింది.

అప్ప‌ట్లోనే రష్మిక గురించి సుదీప్ ఒక ఎమోష‌న‌ల్ నోట్ రాసాడు. ``ర‌ష్మిక‌పై మీరంతా ఒక నిర్ధిష్ఠ‌ అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు.. త‌న‌ను త‌ప్పుగా ప్రొజెక్ట్ చేయడం వల్ల నేను మీలో ఎవరినీ నిందించను. రెండేళ్లకు పైగా రష్మిక నాకు తెలుసు. మీ అందరికంటే నాకు బాగా తెలుసు. ఇక్కడ కెరీర్ ముఖ్యం. దయచేసి త‌న నిర్ణ‌యంపై తీర్పు చెప్పడం మానేయండి. త‌న‌ను ప్ర‌శాంతంగా ఉండనివ్వండి`` అని కూడా సుదీప్ అభ్య‌ర్థించాడు. ర‌ష్మిక‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా అత‌డు అండ‌గా నిలిచాడు. రక్షిత్ శెట్టితో విఫలమైన ఎంగేజ్‌మెంట్ పై రష్మిక మందన్న ప్రకటన విడుదల చేయక‌ముందే సుదీప్ లైన్ లోకి వ‌చ్చి అభిమానుల‌ను అదుపులో పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. సోషల్ మీడియాలో ర‌క్షిత్ అభిమానులు ఆమెను ట్రోల్ చేయ‌డం ఆపాల‌ని అభ్య‌ర్థించాడు.

ఇక‌పోతే ఇప్పుడు మ‌రోసారి ర‌ష్మిక మంద‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ను చేయ‌డంతో నెటిజ‌నుల్లో యాంటి గ్యాంగ్ మ‌రోసారి త‌న‌ని ట్రోలింగ్ చేయ‌డం ప్రారంభించారు. ఇప్పుడు కూడా మ‌రోసారి సుదీప్ త‌న‌కు అండ‌గా నిలిచాడు.

ఓసారి సెల‌బ్రిటీగా ప‌బ్లిక్ ఫిగ‌ర్ గా మారితే పూల‌దండ‌ల‌తో పాటు గుడ్లు ట‌మోఆలు మీద ప‌డ‌తాయ‌ని అన్నిటినీ ఎదుర్కొంటేనే బ‌లంగా మార‌తామ‌ని సుదీప్ వ్యాఖ్యానించాడు. ఇలాంటివాటిని ఎదుర్కొనే ద‌శ‌లో ర‌ష్మిక ఉంద‌ని మ‌ద్ధ‌తు ప‌లికాడు. ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ కావాల‌నుకునే ర‌ష్మిక‌కు ఇలాంటివి త‌ప్ప‌ద‌ని కూడా సోష‌ల్ మీడియా ట్రెండ్ పై కిచ్చా పంచ్ వేసాడు. పాన్ ఇండియా న‌టిగా ఎదిగేస్తున్న ర‌ష్మిక‌కు ఇలాంటి నెగెటివిటీ పెర‌గ‌డం స‌హ‌జ‌మ‌ని దీనిని ధీటుగా ఎదుర్కోగ‌ల స‌మ‌ర్థ‌త త‌న‌కు ఉంద‌ని కూడా కితాబిచ్చేశాడు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ర‌ష్మిక‌- కిచ్చా మ‌ధ్య దోస్తానా ఏ పాటిదో అర్థం చేసుకోవ‌చ్చు.