Begin typing your search above and press return to search.

హ‌నుMAN కి అండ‌గా కిచ్చా సుదీప్

By:  Tupaki Desk   |   3 March 2022 4:30 PM GMT
హ‌నుMAN కి అండ‌గా కిచ్చా సుదీప్
X
హ‌ను మ్యాన్ లాంటి ప్ర‌యోగం చేస్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. లార్జ‌ర్ దేన్ లైఫ్ క్యారెక్ట‌ర్ల‌తో సాహ‌సాలే చేస్తున్నాడ‌ని అనాలి. కానీ అత‌డిలో బ్రిలియ‌న్సీ బ‌య‌ట‌ప‌డే సందర్భ‌మిది. టాలీవుడ్ లో మొదటి జోంబీ కామెడీ మూవీ `జోంబీ రెడ్డి` చేసిన తరువాత దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం మొదటి తెలుగు సూపర్ హీరో మూవీ `హను-మ్యాన్` చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

జోంబీ రెడ్డి హీరో తేజ సజ్జా ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది అధునాత‌న సాంకేతిక‌త‌తో తెర‌కెక్కుతున్న చిత్రం. VFX సాంకేతిక‌త‌తో విజువ‌ల్ వండ‌ర్ గా నిల‌వ‌నుంది.

ఒక సాధారణ వ్యక్తికి సూపర్ పవర్స్ వచ్చినప్పుడు దాని పర్యవసానాల గురించిన చిత్ర‌మిది. ఇందులో హనుమంతుడు చేసే అద్భుతాల గురించి తెర‌పై చూపిస్తున్నారు. ఈ సూపర్ హీరో చిత్రంలో తన స్నేహితుడు తేజ సజ్జాను ఎంపిక చేసుకున్నారు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. క‌థానుసారం ప్రేక్షకులు నమ్మేలా ఒక కొత్త ముఖాన్ని కావాల‌నుకుని అత‌డిని ఎంపిక చేసాన‌ని తెలిపారు.

ఇక‌పోతే ఇదే మూవీలో కీరోల్ ని ఆయ‌న ప‌రిచ‌యం చేయ‌నున్నారు. బాద్షా కిచ్చా సుదీప్ ఇందులో అంజ‌మ్మ పాత్ర‌ను ప‌రిచ‌యం చేయ‌నున్నారు. అంజ‌నాద్రి వ‌ర‌ల్డ్ లో ఈ పాత్ర వెన్నెముక లాంటిద‌ని కూడా వెల్ల‌డించారు. రేపు 04 మార్చి ఉద‌యం 10:08AM కి అంజ‌మ్మ పాత్ర‌ను రివీల్ చేయ‌నున్నారు. ఆ మేర‌కు టీమ్ అధికారికంగా పోస్ట‌ర్ ని లాంచ్ చేసింది.

విక్రాంత్ రోనాగా కిచ్చా బ‌రిలో

ఇటీవలి కాలంలో శాండల్ వుడ్ లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో `విక్రాంత్ రోనా` ఒకటి. అనుప్ బండారి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరో కిచ్చా సుదీప్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను నిర్మాతలు వెల్లడించారు.

ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కిచ్చా సుదీప్ ఈ సినిమాని ఇంగ్లీష్ లో డబ్బింగ్ పూర్తి చేశారు. కన్నడ- తెలుగు- తమిళం- మలయాళం- హిందీ భాషలతో పాటు ఇంగ్లీషులో కూడా సినిమా విడుదలవుతోంది. ఒక సినిమాకు ఇంగ్లీష్ లో డబ్బింగ్ చెప్పిన మొదటి కన్నడ నటుడు కిచ్చా సుదీప్.

నిరూప్ భండారి- నీతా అశోక్- జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఈ భారీ బడ్జెట్ సినిమాలో భాగం. షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ కి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. కిచ్చా న‌టిస్తున్న విక్రాంత్ రోనా పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌ల‌వుతోంది.