Begin typing your search above and press return to search.

చాలా గ్యాప్‌ తర్వాత స్టార్ట్‌ అవ్వడంపై ‘ఈగ’ స్టార్‌ ఎమోషన్‌

By:  Tupaki Desk   |   20 July 2020 12:45 PM IST
చాలా గ్యాప్‌ తర్వాత స్టార్ట్‌ అవ్వడంపై ‘ఈగ’ స్టార్‌ ఎమోషన్‌
X
ఇండియాలో కరోనా కేసులు మార్చి నుండి పెరుగుతూ వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించింది. అప్పటి నుండి షూటింగ్స్‌ బంద్‌ అయ్యాయి. కొందరు లాక్‌ డౌన్‌ కు ముందు నుండే షూటింగ్స్‌ కు దూరం అయ్యారు. గత నెలలో లాక్‌ డౌన్‌ సడలింపులో భాగంగా షూటింగ్స్‌ కు అనుమతులు ఇచ్చారు. అయితే కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో స్టార్స్‌ ఎవరు కూడా షూటింగ్స్‌ కు ముందుకు రావడం లేదు. చిన్న యాడ్‌ లో నటించేందుకు వెళ్లిన అమితాబచ్చన్‌ కు కరోనా అంటుకోవడంతో స్టార్స్‌ మరింతగా భయపడుతున్నారు. ఇంతటి ఆందోళనకర పరిస్థితుల్లో కూడా కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌ షూటింగ్‌ కు సిద్దం అయ్యాడు.

బెంగళూరు నుండి వచ్చి హైదరాబాద్‌ లోని అన్నపూర్ణ స్టూడియోలో సుదీప్‌ షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. తన ‘ఫాంటమ్‌’ చిత్రం షూటింగ్‌ ను అన్నపూర్ణ స్టూడియోలో మొదలు పెట్టినట్లుగా ఆయన పేర్కొన్నాడు. చాలా రోజుల తర్వాత మేకప్‌ వేసుకుని కెమెరా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నాడు. హాలీడేస్‌ పూర్తి చేసుకుని నా పాషన్‌ ను మళ్లీ మొదలు పెట్టినట్లుగా ఉంది. నా పాషన్‌ సినిమా అంటూ సుదీప్‌ ట్వీట్‌ చేశాడు.

షూటింగ్‌ పున: ప్రారంభించిన సందర్బంగా సుదీప్‌ చిత్రంలోని తన పాత్రను పరిచయం చేశాడు. విక్రాంత్‌ రానాకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అనూప్‌ బండారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ థ్రిల్లర్‌ మూవీలో సుదీప్‌ విభిన్నంగా కనిపిస్తాడనే టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి చాలా ప్రతిష్టాత్మంగా భావిస్తున్న ‘ఫాంటమ్‌’ మూవీ ప్రారంభం అవ్వడం పట్ల సుదీప్‌ చాలా సంతోషంగా ఉండటంతో పాటు ఎమోషనల్‌ కూడా అవుతున్నాడు. ఆయన ట్వీట్‌ తో అది అర్థం అవుతోంది.