Begin typing your search above and press return to search.
NTR30 రేసులో కియరా వర్సెస్ రష్మిక
By: Tupaki Desk | 14 April 2021 9:30 AMNTR30 సస్పెన్స్ డ్రామాకి చెక్ పెట్టేస్తూ కొరటాలతో ప్రాజెక్ట్ ని అధికారికం చేసిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్-కొరటాల ఫ్రెండు మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `జనతా గ్యారేజ్` తర్వాత తారక్-కొరటాల కాంబినేషన్ లో రెండవ పెద్ద ప్రాజెక్ట్ గురించి ఇటీవల ప్రకటించడంతో అభిమానులు ఎగ్జయిట్ అవుతున్నారు. ఉగాది సందర్భంగా ఈ ప్రాజెక్టును ప్రకటించారు. పాన్-ఇండియా బడ్జెట్ తో అత్యంత భారీగా ఈ మూవీని తెరకెక్కించనున్నారు.
తాజా సమాచారం మేరకు ఈ సినిమా కథానాయికను దర్శకనిర్మాతలు ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. బాలీవుడ్ అందాల నాయిక కియారా అద్వానీ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకూ కియరా సంతకం చేయలేదు. ఒకవేళ ఓకే అయితే.. కియారా మొదటిసారి ఎన్టీఆర్ సరసన ఛాన్స్ దక్కించుకున్నట్టే అవుతుంది. భరత్ అనే నేనుతో కియరాని టాలీవుడ్ కి పరిచయం చేసింది కొరటాలనే కాబట్టి ఇప్పుడు తననే కోరుకుంటున్నారట. కానీ కియరా బాలీవుడ్ షెడ్యూళ్లు అనుకూలించకపోతే రష్మిక మందన్న లేదా పూజా హెగ్డేల్లో ఎవరో ఒకరికి ఆఫర్ దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.