Begin typing your search above and press return to search.

టాప్ లెస్ కానే కాదు.. చూసే కళ్లతోనే సమస్యంతా?

By:  Tupaki Desk   |   2 Sep 2021 4:10 AM GMT
టాప్ లెస్ కానే కాదు.. చూసే కళ్లతోనే సమస్యంతా?
X
కలర్ తో అందాల విందు చేస్తే ఏం బాగుంటుంది. అందుకే.. ఎంచక్కా రోటీన్ కు కాస్త భిన్నంగా బ్లాక్ అండ్ వైట్ లో ఓరకంటితో ఒక లుక్ ఇచ్చేసి పిచ్చిక్కించే కియారా అడ్వాణీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ కావటం తెలిసిందే. ఈ ఏడాది బాగా చర్చకు వచ్చిన.. అందరిని ఆకర్షించిన కియారా ఫోటోల్లో ఇదొకటి. ఇసుక తిన్నెల మీద పడుకున్న ఆమె.. టాప్ లెస్ గా ఈ ఫోటో షూట్ చేసిందన్న భావన కలుగక మానదు.

ఫోటోను చూసినంతనే ఇలా అనిపించిన ఆమె ఫోటోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాదాపు మూడున్నర నెలల క్రితం పోస్టు చేసిన ఈ ఫోటో అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో.. ఎవరికి నచ్చినట్లుగా వారు రాసేయటం మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే.. ఈ ఫోటో తీసిన సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ తాజాగా ఈ ఫోటో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కియారా ఫోటోకు సంబంధించిన వ్యాఖ్యల్ని తాను చూశానని.. టాప్ లెస్ అంటూ షూట్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. కానీ చాలామంది ఊహించినట్లుగా ఇదేమీ టాప్ లెస్ తో ఫోటో షూట్ చేయలేదన్నారు. అదంతా కెమేరా మేజిక్ అని చెప్పుకొచ్చాడు.

అసభ్యత ఫోటోలో లేదని.. చూసే కళ్లలో ఉందని.. దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం తనకు ఇష్టం లేదన్నారు. కలర్ తో కాకుండా.. రోటీన్ కు భిన్నంగా ఉంటుందనే ఉద్దేశంతోనే తానీ షూట్ చేసినట్లు పేర్కొన్నాడు. మొత్తానికి పెద్ద ఎత్తున జరిన చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేసేలా డబూ రత్నానీ తాజా కామెంట్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఏమైనా చూసినంతనే కిక్ ఎక్కించే ఈ ఫోటో కియారాకు మాత్రం స్పెషల్ గా నిలుస్తుందని మాత్రం చెప్పక తప్పదు.