Begin typing your search above and press return to search.

డేట్స్ లేవు ఇప్పుడు రానంటున్న స్టార్ హీరోయిన్

By:  Tupaki Desk   |   15 April 2020 4:15 AM GMT
డేట్స్ లేవు ఇప్పుడు రానంటున్న స్టార్ హీరోయిన్
X
కియారా అద్వానీ. టాలీవుడ్ లో భరత్ ఆనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. బాలీవుడ్ లో ఓ రేంజ్ హిట్స్ తో దూకుసుకుపోతున్న ఈ బ్యూటీని టాలీవుడ్ నిర్మాతలు తాజాగా సంప్రదించగా పారితోషకం విషయంలో వాళ్ళకి కియారా షాకిచ్చినట్టుగా టాక్. మరి కియారా అద్వానీ అడిగింది అని కాదు కానీ బాలీవుడ్ లో ఈ సుందరి నాలుగైదు సినిమాలతో బిజీగా ఉందట. ప్రస్తుతం కియారా కావలనంటే ఆ మాత్రం ఇవ్వాల్సిందే. చాలా కాలం నుండి అనేక తెలుగు చిత్రాల కోసం ఆమెను సంప్రదించినా ఆమె వాటిని తిరస్కరించిందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ విషయం పై ఆమె ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. "తను ఏ తెలుగు సినిమాను ఎప్పుడూ తిరస్కరించలేదట. బాలీవుడ్‌లో చేతినిండా సినిమాలు ఉన్నాయి. అందుకే డేట్లు సర్దుబాటు చేయలేక పోతుందట. అయితే త్వరలో టాలీవుడ్‌లో ఒక పెద్ద సినిమాపై సంతకం చేస్తా"అని కియారా తెలిపినట్లు సమాచారం. డేట్స్ వలన కాదు అన్నా ఇంకో కారణంతో తిరస్కరించినా తిరస్కరించడమే అంటున్నారు సినీ విశ్లేషకులు. మరోవైపు… తెలుగులో ఆమె ఇంతకుముందు పనిచేసిన మహేష్ బాబు, రామ్ చరణ్ ల పై ఆమె ప్రశంసలు కురిపించింది.

మహేష్ బాబు, రాంచరణ్ లాంటి స్టార్ లతో పనిచేయడం గొప్ప అనుభవం చెప్పింది. మహేష్ బాబు చాలా ఫ్రెండ్లీ సూపర్ స్టార్. రామ్ చరణ్ మంచి ఫ్రెండ్ అయ్యాడని కియారా చెప్పింది. త్వరలో పరశురం దర్శకత్వం వహించబోయే మహేష్ బాబు తదుపరి చిత్రం కోసం కియారాను హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఆమె అనేక బాలీవుడ్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. చూడాలి మరి అమ్మడు ఏం చేయనుందో.. పెద్ద సినిమా ఆఫర్ వస్తే చేస్తానంటుంది. మరి మహేష్ బాబు సినిమా అంటే అమ్మడి నిర్ణయం ఎలా ఉండబోతుందో నెట్టింట్లో చర్చనీయాంశం అయింది.