Begin typing your search above and press return to search.

వీడియో: కిల్లింగ్ లుక్ తో కిల్ చేస్తున్న కియ‌రా

By:  Tupaki Desk   |   3 March 2021 6:30 AM GMT
వీడియో: కిల్లింగ్ లుక్ తో కిల్ చేస్తున్న కియ‌రా
X
కిల్ల‌ర్ లుక్ తో కిల్ చేయ‌డ‌మెలానో కియ‌రాని చూస్తే అర్థ‌మ‌వుతుంది. కెరీర్ ప్రారంభించిన చాలా త‌క్కువ స‌మ‌యంలో ఈ అమ్మ‌డు స్టార్ హీరోయిన్ స్టాట‌స్ అందుకుంది. ప‌లు ప్ర‌ఖ్యాత కార్పొరెట్ బ్రాండ్ల‌ను ఖాతాలో వేసుకుని భారీగా ఆర్జిస్తోంది.

ఇంత‌కుముందే మెబాజ్ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో దేవ‌ర‌కొండ‌తో క‌లిసి న‌టించింది. ఆ వీడియోలు ఫోటోలు ఇంకా అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికిప్పుడు డ‌జ‌ను పైగా కార్పొరెట్ బ్రాండ్ల‌కు కియ‌రా ప్ర‌చార‌క‌ర్త‌గా ఉంది. తాజాగా మ‌రో రేర్ ప్రొడ‌క్ట్ ని ఖాతాలో వేసుకుంది. ప్ర‌ఖ్యాత `ఆర్గానిక్` షాపింగ్ చైన్ కి ఈ అమ్మ‌డు ప్ర‌చారం చేస్తోంది. ఈ డీల్ కోట్ల‌లో ఉంటుంద‌ని అంచ‌నా.

తాజాగా వాణిజ్య ప్ర‌క‌ట‌న షూటింగ్ లో కియ‌రా పాల్గొంది. యాడ్ షూట్ ఆద్యంతం ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల్లో కియ‌రా మెరుపులు మెరిపిస్తోంది. తెర‌పై క‌నిపించేది కేవ‌లం కొన్ని సెక‌న్ల ప్ర‌క‌ట‌నే కానీ దానికోసం ఎన్ని హంగులు అవ‌స‌ర‌మో ఈ 2 నిమిషాల వీడియో చూస్తే అర్థ‌మ‌వుతుంది. కియ‌రా ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులిస్తూ అదిరిపోయే ఎక్స్ ప్రెష‌న్స్ తో మెరిపిస్తోంది. ఇందులోనే లాలిపాప్ చేత‌ప‌ట్టి నోటికి అందిస్తూ వెరైటీ ఎక్స్ ప్రెష‌న్ తో ఆక‌ట్టుకుంది. త్వ‌ర‌లోనే ఈ ప్ర‌క‌ట‌న ఎయిర్ కానుందిట‌. బాలీవుడ్ లో కియ‌రా వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీ. కార్తీక్ ఆర్య‌న్ స‌ర‌స‌న న‌టించిన భూల్ భుల‌యా 2 త్వ‌ర‌లో రిలీజ్ కానుంది.