Begin typing your search above and press return to search.

కియ‌రా చిన్న‌ప్ప‌టి చిలిపి అల్ల‌రి వేషాలు

By:  Tupaki Desk   |   24 April 2020 3:30 AM GMT
కియ‌రా చిన్న‌ప్ప‌టి చిలిపి అల్ల‌రి వేషాలు
X
ముంబై బ్యూటీ కియ‌రా అద్వాణీ స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. అటు హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ స‌హా ఇటు సౌత్ లోనూ ఈ అమ్మ‌డికి భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. భ‌ర‌త్ అనే నేను- విన‌య విధేయ రామ చిత్రాల‌తో సౌత్ లో ఘ‌ట్ట‌మ‌నేని- మెగా ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది. అయితే హిందీ ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస అవ‌కాశాలతో బిజీ అయిపోవ‌డంతో టాలీవుడ్ ని లైట్ తీస్కుంది. ప్ర‌స్తుతం అక్క‌డ అర‌డ‌జ‌ను ప్రాజెక్టుల‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీ. మ‌రోవైపు నిరంత‌రం ర్యాంప్ వాక్ లు.. ఫ్యాష‌న్ ఈవెంట్లు.. ప్ర‌క‌ట‌న‌ల‌తోనూ బిజీ బిజీ.

స్టార్ గా ఎదిగిన త‌ర్వాత స‌రే కానీ.. అస‌లు ఈ రంగుల ప్ర‌పంచంతో సంబంధ‌మే లేకుండా.. ఒక చిన్నారి గా ఉన్న‌ప్పుడు కియ‌రా ఎలా ఉండేదో తెలుసా? ఇదిగో ఈ వీడియోలు చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం లాక్ డౌన్ వేళ ఇంట్లోనే తీరిగ్గా స‌మ‌యం స్పెండ్ చేస్తున్న కియ‌రా త‌న చిన్న‌ప్ప‌టి చిలిపి వేషాల‌కు సంబంధించిన వీడియోల్ని అభిమానుల కోసం సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తోంది. కియ‌రా బాల్యంలోని జ్ఞాప‌కాల్లోకి వెళ్లిపోయి షేర్ చేసిన వీడియోలు అభిమానుల్లో వైర‌ల్ అవుతున్నాయి.

తన చిన్ననాటి వీడియోలను పంచుకుంటూ.. కియారా #ది వండ‌ర్ ఈర్స్ అనే హ్యాష్ ట్యాగ్ ‌ను కియరా ఉపయోగిస్తోంది. ఓ వీడియోలో నృత్య కళాకారిణి దుస్తులలో భరతనాట్యం చేస్తూ ఎంతో క్యూట్ గా క‌నిపించింది. అలాగే వేరొక వీడియోలో తన తల్లితో సంభాషణకు సంబంధించిన‌ స్నిప్పెట్ ను షేర్ చేసింది. ఓసారి సైకిల్ పై వెళుతూ.. తన తల్లి కోసం తాను ఎదురుచూస్తున్నానని చెప్పింది. లాక్ డౌన్ వేళ ప్ర‌స్తుతం నా మానసిక స్థితి సరిగ్గా ఇదే అని కియారా తెలిపింది. ఇక కెరీర్ ప‌రంగా చూస్తే.. కరోనావైరస్ విప‌త్తు వ‌ల్ల నాలుగైదు చిత్రాలు సెట్స్ లో మిడిల్ లోనే ఉన్నాయి. లక్ష్మీ బాంబ్- దోస్తానా 2- షేర్షా - ఇందూ కి జవానీ లాంటి చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. భూల్ భూలైయా 2 లోనూ కార్తీక్ ఆర్య‌న్ స‌ర‌స‌న‌ నాయిక‌గా న‌టిస్తోంది.