Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ రైమ్ తో కియారా ఆట‌లు

By:  Tupaki Desk   |   16 April 2022 2:30 PM GMT
చ‌ర‌ణ్ రైమ్ తో కియారా ఆట‌లు
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఆర్ సీ 15వ చిత్రంగా మెగా అభిమానుల ముందుకు రాబోతుందీ చిత్రం. ఇప్ప‌టికే సెట్స్ కి వెళ్లిన చిత్రం కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. హైద‌రాబాద్..రాజ‌మండ్రి లో కీల‌క షెడ్యూల్స్ పూర్తిచేసారు. వాటిపై చ‌ర‌ణ్ స‌హా కీల‌క న‌టీన‌టుల‌పై స‌న్నివేశాలు చిత్రీక‌రిచారు.

రాజ‌మండ్రి షెడ్యూల్ షూట్ లో కియారా అద్వాణీ కూడా పాల్గొంది. చ‌ర‌ణ్‌..కియారాల‌పై శంక‌ర్ కొన్ని సీన్స్ పూర్తి చేసారు. అటు పై చ‌ర‌ణ్ 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ ద‌గ్గ‌ర‌కి రావ‌డంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. కొద్ది రోజుల పాటు 'ఆర్ ఆర్ ఆర్' ప్ర‌చారంలోనే బిజీ అయ్యారు. మార్చి 25న'ఆర్ ఆర్ ఆర్'రిలీజ్ అవ్వ‌డంతో చ‌ర‌ణ్ ఫ్రీ అయిపోయారు. అటుపై స‌క్సెస్ పార్టీలు సైతం చ‌ర‌ణ్ పూర్తి చేసేసాడు.

దీంతో చ‌ర‌ణ్ మ‌ళ్లీ ఆర్ ఈసీ 15 షూటింగ్లో బిజీ అయిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఆన్ సెట్స్ నుంచి కియారా ఫోటో ఒక‌టి లీకైంది. ఇందులో కియారా వంగ‌పువ్వు రంగు పంజాబీ డ్రెస్... మెడ‌లో మ్యాచింగ్ చున్నీ ధ‌రించి న‌వ్వుతూ కెమారాకి ఫోజులిచ్చి క‌నిపిస్తుంది.

ఇక కియారా చేతుల్లో చ‌ర‌ణ్ కి ఎంతో ఇష్ట‌మైన ప‌ప్పీ రైమ్ కూడా ఉంది. కియారా కాసేపు రైమ్ తో టైంపాస్ చేసిన‌ట్లు తెలుస్తుంది.

కియారాకి కూడా ప‌ప్పీలు అంటే ఎంతో ఇష్టం. త‌న ఇంట్లో ఖాళీ స‌మయాన్ని వాటితోనే గ‌డుపుతుంది. అదే ఉత్సాహం 'ఆర్ సీ 15' సెట్స్ లోనూ క‌నిపిస్తుంది. చ‌ర‌ణ్ రైమ్ క‌నిపించ‌గానే ద‌గ్గ‌ర‌కు చేతుల్లోకి తీసుకుని కౌగిలిచించుకుంది. ఇక చ‌ర‌ణ్ కి రైమ్ అంటే ప్రాణ స‌మానం. చ‌ర‌ణ్ ఇంట్లో ధోనీ ఇంట్లో త‌ర‌హాలోనే పెంపుడు జంతువులు ఎక్కువ‌గానే ఉంటాయి.

అందులో రైమ్ వ‌య‌సు చిన్న‌ది. దీంతో చ‌ర‌ణ్ రైమ్ ని ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు. ఖాళీ స‌మ‌యాన్ని రైమ్ తోనే గ‌డుపుతారు. ఈ ఫోటో ద్వారా 'ఆర్ సీ 15' సినిమా షూటింగ్ మ‌ళ్లీ షురూ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ గ్యాప్ లో శంక‌ర్ 'ఇండియ‌న్ -2' ప‌నుల్లో బిజీ అయ్యారు.