Begin typing your search above and press return to search.

విధేయ రాముడి భుజాలపై సీత పాదాలు

By:  Tupaki Desk   |   1 Jan 2019 7:56 AM GMT
విధేయ రాముడి భుజాలపై సీత పాదాలు
X
ఈ నెల 11న బాక్స్ ఆఫీస్ రచ్చ కోసం రాబోతున్న వినయ విధేయ రామ మీద మెగా ఫాన్స్ అంచనాలు మాములుగా లేవు. ట్రైలర్ లో దీన్ని అవుట్ అండ్ అవుట్ పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ప్రొజెక్ట్ చేయడంతో ఆ వర్గం ఫస్ట్ ఛాయస్ సంక్రాంతికి ఇదే ఉండనుంది. ప్రీ రిలీజ్ లో అతిధులు చెప్పిన మాటలు స్వయంగా చిరంజీవి దీన్ని గ్యాంగ్ లీడర్ తో పోల్చడం మొత్తానికి హైప్ ని ఓ రేంజ్ కి తీసుకెళ్లాయి. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ వదిలింది వివిఆర్ టీమ్.

చరణ్ ఓ గుడిలో గంట కొట్టించేందుకు హీరోయిన్ కియారా అద్వానీని తన భుజాలపైకి ఎక్కించుకుని సందర్భాన్ని ఇందులో చూపించిన తీరు అభిమానులకే కాదు ఫ్యామిలిస్ కి సైతం బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. బ్యాక్ డ్రాప్ లో నలుగురు అన్నయ్యలు ప్రశాంత్-ఆర్యన్ రాజేష్-రవి వర్మ-మధునందన్ లతో పాటు వదినలు పిల్లలు కూడా ఉన్నారు. అంటే సినిమాలో ఇదో కూల్ సిచువేషన్ లో వచ్చే పాటన్న మాట. ఈ పోస్టర్ తాలూకు హోర్డింగ్స్ నిన్నటి నుంచే హైదరాబాద్ మెయిన్ సెంటర్స్ లో పెట్టేసారు. చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. విలన్ వివేక్ ఒబెరాయ్ హీరో రామ్ చరణ్ మధ్య పోరాటమే మెయిన్ థీమ్ గా రూపొందిన వినయ విధేయ రామ ఆల్బమ్ ఇప్పటికే రచ్చ చేస్తోంది.

ట్యూన్స్ పరంగా కాకుండా చెర్రీ డాన్సుల మీద అభిమానులు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తన కుటుంబానికి ఆపద వచ్చినప్పుడు వినయ విధేయ రాముడు ఏం చేస్తాడు అనే పాయింట్ మీద రూపొందిన ఈ మూవీ జనవరి 11 తెల్లవారుఝామున బెనిఫిట్ షోలతో సందడి మొదలుపెట్టనుంది. నాలుగు సినిమాల రేస్ లో ఈ రాముడి వేట ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది