Begin typing your search above and press return to search.

కియ‌రానే ఫాలో అవుతోంది ఎవ‌రీ అమ్మ‌డు?

By:  Tupaki Desk   |   9 Jan 2021 11:30 AM GMT
కియ‌రానే ఫాలో అవుతోంది ఎవ‌రీ అమ్మ‌డు?
X
ప్ర‌స్తుతం బాలీవుడ్ లో మోస్ట్ ప్రామిస్సింగ్ హీరోయిన్ గా పాపుల‌రైంది కియ‌రా అద్వాణీ. కెరీర్ ప్రారంభించిన కేవ‌లం నాలుగైదేళ్ల‌లో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. రెడ్ కార్పెట్ ఈవెంట్ల‌లో రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌తో కియ‌రా చేసే హ‌డావుడి అంతా ఇంతా కాదు. అయితే కియ‌రా సంగ‌తి అటుంచితే.. ఈ అమ్మ‌డికి సిస్ట‌ర్ ఉంటే అచ్చం ఇదిగో ఇలా ఉంటుంది! అనేలా డౌట్లు రైజ్ చేసింది ఈ న‌వ‌త‌రం బ్యూటీ.

తాజా ఫోటోషూట్ లో.. డెనిమ్ షార్ట్ లో కుర్ర‌కారు మ‌తి చెడ‌గొడుతున్న ఈ అమ్మ‌డు ఎవ‌రు? అంటే.. పేరు అమ్రిన్ ఖురేషి. నిర్మాత సాజిద్ ఖురేషి కుమార్తె. ప్ర‌స్తుతం `బ్యాడ్ బోయ్స్` అనే చిత్రంతో బాలీవుడ్ కి ప‌రిచ‌యం అవుతోంది. ఇదే చిత్రంతో క్లాసిక్ హీరో మిథున్ చ‌క్ర‌వ‌ర్తి వార‌సుడు న‌మాషి చ‌క్ర‌వ‌ర్తి వెండితెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాని సాజిద్ ఖురేషి స్వ‌యంగా నిర్మిస్తున్నారు. నిజానికి బిజినెస్ ఉమెన్ గా కొన‌సాగుతున్న అమ్రిన్ అనుకోకుండా క‌థానాయిక అయ్యారు.

ఇక సోష‌ల్ మీడియాల్లో రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌తో కియ‌రా తీరుగానే ఈ అమ్మ‌డు చెల‌రేగుతోంది. ఇదిగో ఇలా స్టైలిష్ డిజైన‌ర్ టాప్ .. పొట్టి నిక్క‌రుతో అలా అలా క్యాట్ వాక్ చేస్తూ గుండెలు కొల్ల‌గొట్టింది. ఆ చేతిలో డిజైన‌ర్ హ్యాండ్ బ్యాగ్ చూశారుగా.. చూసేందుకు అంత సింపుల్ గా క‌నిపిస్తున్నా అది టూమ‌చ్ కాస్ట్ లీనే. మొత్తానికి కియ‌రాను ఇమ్మిటేట్ చేస్తూ అలా న‌డిచొస్తుంటే కుర్రాళ్ల‌కు మాత్రం క‌న్ఫ్యూజ్ అయిపోతున్నారు మ‌రి.