Begin typing your search above and press return to search.

కార్ డోర్ తెరిచిన పెద్దాయ‌న‌కు థాంక్స్ అయినా చెప్ప‌దా?

By:  Tupaki Desk   |   8 July 2021 7:30 AM GMT
కార్ డోర్ తెరిచిన పెద్దాయ‌న‌కు థాంక్స్ అయినా చెప్ప‌దా?
X
`భ‌ర‌త్ అనే నేను` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాతో టాలీవుడ్ లో ప్ర‌వేశించిన‌ కియారా ఆ త‌ర్వాత విన‌య విధేయ రామా లాంటి డిజాస్ట‌ర్ ఎదుర‌వ్వ‌డంతో తీవ్రంగా నిరాశ‌ప‌డింది. టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవ్వాల‌ని ఆశించింది గానీ.. ఆరంభ‌మే పెద్ద దెబ్బ త‌గిలింది. దాంతో ఆశ‌లు ఫ‌లించ‌లేదు. దీంతో పూర్తిగా బాలీవుడ్ పైనే దృష్టి సారించింది. ప్ర‌స్తుతం హిందీ ప‌రిశ్ర‌మ‌లోనే సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రెండేళ్లుగా ముంబైలోనే ఉంటూ హిందీ ఇండ‌స్ట్రీలోనే టాప్ పొజిష‌న్ పై క‌న్నేసింది. ప్ర‌స్తుతానికి కియరా బాలీవుడ్ కెరీర్ ఆశించిన రేంజులోనే ఉంది.

ఇదే స‌మ‌యంలో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో పీక‌ల్లోతూ ప్రేమ‌లో కూడా మునిగిన‌ట్లు బాలీవుడ్ మీడియా వేడెక్కించేస్తోంది. వాటికి త‌గ్గ ఆధార‌లు కూడా బ‌య‌ట‌కొచ్చాయి. ఇరువురు స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు....విదేశీ టూర్ల కు సంబంధించిన ప్రూఫ్ ల‌తో ఇంకొంత క్లారిటీ దొరికింది. అయితే తాజాగా కియారా చేసిన ఓ ప‌నికి సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

కియ‌రా హ‌డావుడిగా ఎక్క‌డికో వెళుతోంది. ఇంత‌లోనే ఓ పెద్దాయ‌న తో త‌న కారు డోర్ తీయించడం ద‌ర్పం ఒల‌క‌బోయ‌డం క‌నిపించింది. ఆ యాక్ట్ తో త‌న సంస్కారాన్ని నిరూపించుకుంది! అంటూ నెటిజ‌నులు త‌న‌పై తీవ్రంగా మండిప‌డుతున్నారు. కార్ లో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ఇంటికొచ్చిన కియారా కారు దిగుతున్న స‌మయంలో అక్క‌డ వ‌య‌సు మీద ప‌డిన సిబ్బంది డోర్ తీసారన్న‌ది లోగుట్టు. మ్యాడ‌మ్ గారికి మ‌ల్హోత్రా అసిస్టెంట్లు అస్స‌లు గౌర‌వం ఎక్క‌డా త‌గ్గ‌నివ్వ‌డం లేదు అంటూ గుస‌గుస‌లు వైర‌ల్ అవుతున్నాయి.

అలాంటి సాయానికి క‌నీసం కృత‌జ్ఞ‌త కూడా చెప్ప‌కుండా.. ఆ పెద్దాయ‌న ముఖం వైపు చూస్తూ కియ‌రా వెళ్లిపోతూ క‌నిపించింది. మ‌రి ఆ వ్య‌క్తి కియారా వ్య‌క్తిగ‌త సిబ్బంది కానే కాదు.. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా సెక్యురిటీ అని భావిస్తున్నారు. ఏదేమైనా ఓ న‌టి తెలిసో తెలియ‌కో పెద్దాయ‌న ప‌ట్ల అలా చేయ‌డం ముమ్మాటికి త‌ప్పేనంటూ సోష‌ల్ జ‌నం మండి ప‌డుతున్నారు. ఆ పెద్దాయ‌నికి ఇదే వేదిక ద్వారా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. సాధార‌ణంగా చాలా మంది సెల‌బ్రిటీలు ఇంట్లో ఎలా ఉన్నా...బ‌య‌ట‌కొచ్చిన త‌ర్వాత చాలా విన‌యవిధేయ‌త‌లు క‌న‌బ‌రుస్తారు. ఇలాంటి సంద‌ర్భాల్లో కృత‌జ్ఞ‌తాభావం వ్య‌క్తం చేస్తారు. కానీ కియారాలో ఆ యాంగిల్ ఎక్క‌డా క‌నిపించ‌లేద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌నులు కామెంట్లు పెడుతున్నారు.