Begin typing your search above and press return to search.

సీక్రెట్ ల‌వ‌ర్ తో కెమెరాకి చిక్కిన RC15 హీరోయిన్

By:  Tupaki Desk   |   16 Oct 2021 5:59 AM GMT
సీక్రెట్ ల‌వ‌ర్ తో కెమెరాకి చిక్కిన RC15 హీరోయిన్
X
కియారా అద్వాణి -సిద్దార్థ్ మ‌ల్హోత్రా జంట‌ పీక‌ల్లోతూ ప్రేమ‌లో ఉన్నార‌ని ప్ర‌చార‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట ఒక‌రిని వీడి ఒక‌రు ఉండ‌లేక‌పోతున్నార‌ని.. చెట్టాప‌ట్టాలేసుకుని షికార్లు చేస్తున్నార‌ని చెప్పేందుకు బాలీవుడ్ మీడియా చాలా ఆధారాల్ని బ‌య‌ట‌పెట్టింది. వ్య‌క్తిగ‌తంగా క‌లుసుకోవ‌డం...బీచ్ ల‌కు ట్రిప్పులు...విదేశీ ప్ర‌యాణాలు...ముంబై వీధుల్లో షికార్లు కొడుతూ చాలాసార్లు మీడియా కంటికి చిక్కారు. కానీ ల‌వ్ మ్యాట‌ర్ ని మాత్రం ధృవీక‌రించ‌డం లేదు. ప్ర‌చారం అంతా అన‌ధికారిక‌మే. మీ ఇద్ద‌రూ రిలేష‌న్ లో ఉన్నారా? అని ప్ర‌శ్నించినా అబ్బే అలాంటిందేమి లేదంటూ మాట దాటవేస్తున్నారు..ముఖం చాటేస్తున్నారు త‌ప్ప స‌రైన ఆన్స‌ర్ లేదు.

ఇలా ముంబై మీడియాకు చాలాసార్లు చేదు అనుభ‌వం ఎదురైంది. తాజాగా మ‌రోసారి ఈ ల‌వ్ బ‌ర్స్డ్ జంట‌గా సినిమా థియేట‌ర్లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. విక్కీ కౌశ‌ల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `స‌ర్ధార్ ఉద్ద‌మ్` ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా కియారా-సిద్ధార్థ్ విక్కీ సినిమా చూడ‌టానికి జంట‌గా థియేట‌ర్ కి వ‌చ్చారు. కియారా లైట్ క‌ల‌ర్ పంజాబీ డ్రెస్.. మ్యాచింగ్ దుప‌ట్టా తో సంప్ర‌దాయ దుస్తుల్లో కనిపించింది. ఇక సిద్ధార్థ్ డార్క్ బ్లా జాకెట్..బ్లాక్ టీష‌ర్ట్ ధ‌రించాడు. ఇద్ద‌రు జంట‌గా సినిమాకొస్తున్న స‌మ‌యంలో ఒక్కసారి కెమెరా ఫోక‌స్ అంతా ఆ జంట పై ప‌డింది. ఇద్ద‌రు జంట‌గా కొన్ని ఫోటోలు ఇవ్వ‌గా..విడి విడిగా మ‌రికొన్ని ఫోటోలు ఇచ్చి సినిమాకెళ్లారు. ఇలా క‌లిసి మీడియాకు చిక్క‌డం కొత్తేం కాదు. గ‌తంలోనూ చాలాసార్లు ఇద్ద‌రు జంట‌గా క‌లుసి ఉన్న‌ప్పుడు ఫోటో జ‌ర్న‌లిస్ట్ లు కోసం ఎంతో ఉత్సాహంగా..హుషారుగా ఫోటోలిచ్చారు.

ఇద్ద‌రు డేటింగ్ లో ఉన్నారా? అని ప్ర‌శ్నిస్తే మాత్రం అలాంటిదేమి లేద‌ని త‌ప్పించుకున్నారు. అయితే నిన్న‌టి సెష‌న్ లో ఎలాంటి ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం కాలేదు. ఆ ఇద్ద‌రి ఇబ్బందిని ముందే గ‌మనించి మీడియా జ‌నం ప్ర‌శ్నించ‌డం ఎందుకులే? అని విడిచిపెట్టేసారు. ప్ర‌స్తుతం కియారా టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రంలో న‌టిస్తోంది. గ‌తంలో కియారా `భ‌ర‌త్ అనే నేను`..`విన‌య విధేయ రామ` లోనూ హీరోయిన్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.