Begin typing your search above and press return to search.
మహర్షిని విష్ చేసిన మిసెస్ భరత్
By: Tupaki Desk | 8 May 2019 9:49 AM ISTగత ఏడాది బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన భరత్ అనే నేను ద్వారా పరిచయమైన కీయరా అద్వాని మహర్షి కోసం ముందుకు వచ్చింది. రేపు విడుదలను పురస్కరించుకుని ప్రత్యేకంగా తీసి పంపిన సెల్ఫి వీడియోలో టీం కు విషెస్ చెబుతూ ఈ రోజు తాను టాలీవుడ్ లో ఉన్నాను అంటే దానికి కారణం మహేష్ అని చెబుతూ పూజా హెగ్డే వంశీ పైడిపల్లి అందరికి గ్రీటింగ్స్ చెబుతున్న వీడియో నమ్రతా శిరోద్కర్ తన ఇన్స్ టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
కౌంట్ డౌన్ గంటల్లోకి మారిపోయక నమ్రతా సోషల్ మీడియా వేదికగా గతంలో మహేష్ తో పని చేసిన వారి వీడియోలను వరస బెట్టి షేర్ చేస్తున్నారు. నిన్న సుకుమార్ ది పెట్టారు కాని అందులో ఎక్కడా సుక్కు మహర్షి గురించి ప్రస్తావన తేకపోవడం కొంత చర్చకు దారి తీసింది. సో మిసెస్ భరత్ శుభాకాంక్షలు కూడా మహర్షికి చేరిపోయాయి. అడ్వాన్సు బుకింగ్ మంచి ఊపుమీదున్న మహర్షి రేపు ఎన్ని రికార్డులు నమోదు చేయబోతోందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
తెలంగాణా ప్రభుత్వం 5 ఆటలకు అనుమతి ఇవ్వడం రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ రావడం ఇవన్ని వసూళ్ళ లెక్కల్లో గణనీయమైన మార్పును చూపించేలా ఉన్నాయి. మొదటి ఆటకు పాజిటివ్ టాక్ వస్తే చాలు ఇక ఊచకోతే ఖాయం. పోటీ ఏదీ లేకపోవడం మహర్షికి మరో ప్లస్ పాయింట్. అఫ్ కోర్స్ మహేష్ ఉన్నాడనే ఎవరూ దిగలేదనుకోండి.