Begin typing your search above and press return to search.

ఈ ఆరో నెల నా జీవితాన్ని మార్చింది

By:  Tupaki Desk   |   22 Jun 2021 11:30 PM GMT
ఈ ఆరో నెల నా జీవితాన్ని మార్చింది
X
హీరో మరియు హీరోయిన్స్‌ కు కెరీర్ లో ఒక టర్నింగ్‌ పాయింట్‌ ఉంటుంది. ఆ మూవీతో వారి కెరీర్‌ పూర్తిగా టర్న్‌ అవుతుంది. అలాంటి సినిమా కియారా అద్వానీకి కబీర్ సింగ్‌. టాలీవుడ్ లో సక్సెస్‌ అయిన అర్జున్ రెడ్డికి ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే. హిందీలో రీమేక్ అయిన అర్జున్ రెడ్డి కూడా మంచి సక్సెస్ అయ్యింది. ఆ సినిమాలో నటించిన కియారా అద్వానీ ఒక్కసారిగా బాలీవుడ్ లో స్టార్‌ హీరోయిన్‌ గా మారిపోయింది. ప్రస్తుతం హిందీలో మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా బాలీవుడ్ లో ఈమె నిలిచింది.

కియారా అద్వానీని స్టార్‌ గా నిలిపిన కబీర్‌ సింగ్‌ విడుదల అయ్యి రెండు సంవత్సరాలు అయ్యింది. జూన్ నెలలో విడుదల అయిన కబీర్‌ సింగ్‌ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా సోషల్‌ మీడియాలో నెటిజన్స్ రెండు సంవత్సరాల సందర్బంగా హ్యాష్‌ ట్యాగ్‌ తో ట్రెండ్ చేశారు. ఈ సందర్బంగా కియారా అద్వానీ సోషల్‌ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. తనకు జూన్ మాసం చాలా ప్రత్యేకం అని.. ఈ నెలలోనే తాను నటించిన కబీర్ సింగ్ విడుదల అయ్యింది. జీవితంలో ఎప్పటికి జూన్ మాసంను మర్చిపోలేనంటూ పేర్కొంది.

తెలుగు లో భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమా ల్లో నటించిన కియారా అద్వానీ తెలుగులో మరికొన్ని సినిమాలు చేసేందుకు సిద్దం అవుతోంది. బాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీగా ఉన్నా కూడా తెలుగులో త్వరలోనే ఒక సినిమాలో నటించబోతున్నట్లుగా ఈమె పేర్కొంది.