Begin typing your search above and press return to search.

అసిస్టెంట్ తో ప్రేమలో పడనున్న మహేష్

By:  Tupaki Desk   |   6 March 2018 10:53 AM GMT
అసిస్టెంట్ తో ప్రేమలో పడనున్న మహేష్
X
మహేష్ హీరో కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'భరత్ అనే నేను' సినిమాపై ప్రేక్షకులకు ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ద్వారా మొట్టమొదటిసారి ఒక రాజకీయ నాయకుడిగా ఒక ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు మన సూపర్ స్టార్. ఇక బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమవ్వబోతోంది. మరి ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది?

అన్ని కమర్షియల్ చిత్రాల తరహాలో కేవలం రెండు సీన్లు, మూడు పాటలకు అంకితం అయిపోతోందా లేదా మంచి వెయిట్ ఉన్న కారెక్టరా అని ఎప్పట్నిండో ఫాన్స్ చర్చించబోతున్నారు. అన్ని సినిమాల లాగా కాకుండా ఇందులో చాలా మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర అని తెలుస్తోంది. భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రికి అంటే మన మహేష్ బాబుకి పి.ఏ (పర్సనల్ అసిస్టెంట్) గా కనిపిస్తుందంట ఈ సుందరి. పైగా రెండు మూడు పాటలలో ప్రేక్షకులను పలకరించడం కాకుండా సినిమా మొత్తం మహేష్ బాబు కష్ట సుఖాల్లో అండగా నిలబడుతుందంట. ఎంతైనా సీఎం అండ్ పి.ఏ కి మధ్య లవ్ స్టొరీ అంటే కొత్తగానే ఉండచ్చు.

కియారా కూడా మొదటి సినిమా అయినా అటు గ్లామర్ కు ఇటు పెర్ఫార్మెన్స్ చూపించడానికి ఏ మాత్రం లోటు లేని కారెక్టర్ అవ్వడం వలన చాలా సంతోషంగా ఉందంట. ఈ సినిమా ఏప్రిల్ 20న విడుదల కి సిద్ధంగా ఉంది. హీరో ముఖ్యమంత్రి గా కనిపించిన సినిమాలు తెలుగులో ఒకరకంగా తక్కువే పైగా అందులో పి.ఏ తో రొమాన్స్ అంటే కొత్త పాయింటే. ఏమంటారు?