Begin typing your search above and press return to search.

అద్వానీ అధ్వాన్నమైన డ్రెసింగ్

By:  Tupaki Desk   |   18 Sep 2017 4:16 PM GMT
అద్వానీ అధ్వాన్నమైన డ్రెసింగ్
X
సీఎం గాళ్ ఫ్రెండ్ అంటే.. రియల్ గా ముఖ్యమంత్రి గాళ్ ఫ్రెండ్ అని కాదండీ.. మహేష్ బాబు ఓ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు కదా. ప్రస్తుతం స్పైడర్ మూవీని రిలీజ్ కి రెడీ చేసిన మహేష్ బాబు.. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీని మొదలుపెట్టేశాడు కూడా. భరత్ అను నేను అనే టైటిల్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ భామ కైరా అద్వానీ.

రీసెంట్ గా ఈ భామ ఓ ఛారిటీ ఈవెంట్ కోసం ర్యాంప్ వాక్ చేసింది. ఈ ఈవెంట్ హైద్రాబాద్ లోనే జరగగా.. ఇలాంటి ఈవెంట్స్ కు అందాల భామలు గ్లామర్ ఒలకబోస్తూ అటెండ్ కావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే.. కైరా అద్వానీ మాత్రం గ్లామర్ పేరు చెప్పి.. ఓ డిఫరెంట్ గెటప్ తో ఈ ఈవెంట్ కు హాజరు అయింది. క్లీవేజ్ షోకుల ప్రదర్శన పక్కన పెడితే.. ఓ కాలును పూర్తిగా ఎక్స్ పోజ్ చేస్తూ.. పక్కకి జరిగిపోతున్న డ్రెసింగ్ చూసి.. చూసేవాళ్లకు నోట మాట రాలేదు.

అసలే పిల్లల ఛారిటీ కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తే.. అక్కడికి ఇలాంటి అధ్వాన్నమైన డ్రెస్ ను వేసుకుని కైరా అద్వానీ రావడం ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు. ఈ డ్రెస్ ఏంటి బాబోయ్ అంటూ నిర్వాహకులు తలలు పట్టుకునే పరిస్థితి. కానీ బాలీవుడ్ భామ కావడం.. సూపర్ స్టార్ పక్కన నటిస్తున్న అమ్మాయి కావడంతో.. కిమ్మనలేక ఊరకుండిపోయారట. మొత్తానికి మీడియా ముందుకు వచ్చిన తొలిసారే.. చిత్రమైన పరిస్థితి కల్పించింది కైరా అధ్వానీ.