Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ:భళిరా అనిపిస్తున్న కైరా

By:  Tupaki Desk   |   20 Feb 2018 12:38 PM GMT
ఫోటో స్టోరీ:భళిరా అనిపిస్తున్న కైరా
X
మహేష్ బాబు ఫాన్స్ లో మాత్రమే కాదు రామ్ చరణ్ అభిమానుల్లో కూడా విపరీతమైన ఆసక్తి రేపుతున్న భామ కైరా అద్వాని. ఒక్క సినిమా విడుదల కాకుండానే టాలీవుడ్ లో ఇద్దరు టాప్ స్టార్స్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఆఫర్స్ కొట్టేసిన కైరా గురించి కోలీవుడ్ నుంచి కూడా ఎంక్వయిరీలు వస్తున్నాయి. అంత మహత్తు తనలో ఏముంది అనే సందేహం కలగడం సహజమే. అఫీషియల్ ఫస్ట్ లుక్స్ లో తను ఎలా ఉంటుందో చూడడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు ఎక్కడైనా బయట తీసుకున్న ఫొటోలే ఆధారం అవుతున్నాయి. అలా వచ్చినదే ఇక్కడ మీరు చూస్తున్న స్నాప్. తల్లితో తీసుకున్న కైరాను చూస్తుంటే ఇంత అందం టాలీవుడ్ కు పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు అనిపిస్తోంది కదూ.

ఈ రెండు సినిమాలు కనక హిట్ అయితే కైరా అద్వాని సుడి మామూలుగా ఉండదు. హిందిలో చేసిందే మూడు సినిమాలు. అందులో ఎంఎస్ ధోని తప్ప మిగిలిన రెండు డిజాస్టర్స్. షూటింగ్ లో ఉన్న బాంబే టాకీస్ 2లో కూడా తనొక్కతే హీరొయిన్ కాదు. సో టాలీవుడ్ పై టార్గెట్ పెట్టడమే కరెక్ట్. అందుకే మహేష్, చరణ్ సినిమాల విషయంలో చాలా పట్టుదలగా ఉంది. ఈ రెండు కాకుండా మరో భారీ ఆఫర్ కూడా వెయిటింగ్ లిస్టు లో ఉందట. కాని దాని గురించి నిర్ణయం ఇంకా తీసుకోలేదని టాక్. భరత్ అనే నేనులో కైరా పాత్ర ఎలా ఉంటుంది అనే దాని గురించి ఫాన్స్ కు చిన్న క్లూ కూడా దక్కడం లేదు.

అందిన సమాచారం మేరకు కైరా ఇందులో ప్రతిపక్ష నాయకుడు ప్రకాష్ రాజ్ కూతురిగా కనిపించనుంది అని టాక్. గ్లామర్ తో పాటు పెర్ఫార్మన్స్ కు కూడా స్కోప్ ఉండేలా దర్శకుడు కొరటాల శివ తన పాత్రను తీర్చిదిద్దినట్టు టాక్. శ్రీమంతుడులో శృతి హాసన్ - జనతా గ్యారేజ్ లో సమంతాల కన్నా ఇందులో కైరా పాత్రకు ఎక్కువ స్కోప్ ఉండేలా కొరటాల డిజైన్ చేసినట్టు వార్త. పిక్ లో కైరా అందాలు చూసి మురిసిపోతున్న ఫాన్స్ ఎప్పుడెప్పుడు ప్రిన్స్ పక్కన సిల్వర్ స్క్రీన్ పక్కన చూస్తామా అనే ఎదురు చూస్తున్నారు.