Begin typing your search above and press return to search.

సీక్రెట్ గా బోయ్ ఫ్రెండ్ ఇంటికి.. కానీ అక్క‌డ సీన్ చూసి షాక్ తిన్న కుర్ర బ్యూటీ!!

By:  Tupaki Desk   |   1 Feb 2021 10:09 AM IST
సీక్రెట్ గా బోయ్ ఫ్రెండ్ ఇంటికి.. కానీ అక్క‌డ సీన్ చూసి షాక్ తిన్న కుర్ర బ్యూటీ!!
X
టాలీవుడ్ టు బాలీవుడ్ ఆ కుర్ర‌భామ పేరు మార్మోగుతోంది. అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకున్న ల‌క్కీయెస్ట్ బ్యూటీగానూ పాపుల‌రైంది. ఈ అమ్మ‌డు ఇటీవ‌ల ఓ యువ‌హీరోతో చెట్టాప‌ట్టాల్ అంటూ షికార్లు చేస్తోంది.

మొన్న‌టికి మొన్న మాల్దీవుల్లో ఒంట‌రిగా ఆ హీరోతో షికార్లు చేసి తిరిగి రావ‌డం మీడియా కంట ప‌డింది. ఒంట‌రిగా వెళుతున్నా! జంట‌గా వెళుతున్నా బాలీవుడ్ మీడియా రంగంలోకి దిగి గుట్టు మొత్తం క‌నిపెట్టేస్తోంది. ఆపై వ‌రుస క‌థ‌నాల‌తో హీటెక్కించేస్తోంది. అలా ఈ జంట ఇప్ప‌టికే బోలెడంత పాపుల‌రైపోయింది.

అయినా ఇప్ప‌టికీ త‌మ మ‌ధ్య అనుబంధంపై నోరు మెదప‌రు. ఇదీ సంగ‌తి అని చెప్ప‌నే చెప్పరు ఆ ఇద్ద‌రూ. తాజాగా మ‌రోసారి ఆ ఇద్ద‌రూ కెమెరా కంటికి చిక్కారు. ఎవ‌రికీ ఏ హింటూ ఇవ్వ‌కుండా స‌ద‌రు బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళుతూ మీడియా ఫోటోగ్రాఫ‌ర్ల‌కు చిక్కింది స‌ద‌రు భామ‌. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. త‌న కోసం బాలీవుడ్ మీడియా అంత‌గా ప‌డిగాపులు ప‌డుతోందా? అంటూ షాక్ తిన్న ఆవిడ గారి వాల‌కం ఫోటోల్లో స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది.

ఇంత‌కీ ఈ ఎపిసోడ్ లో యువ జంట ఏది? అంటే.. కియ‌రా అద్వాణీ- సిద్ధార్థ్ మ‌ల్హోత్రా గురించే. ఈ జంట ఇటీవ‌లే మాల్దీవుల విహారానికి వెళ్లిన‌ప్ప‌టి ఫోటోలు ఇంకా అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. ఇంత‌లోనే మ‌రోసారి కెమెరా కంటికి చిక్కారు. కియారా అద్వానీ ఆదివారం ఉదయం తన ర‌హ‌స్య‌ ప్రియుడు అయిన యువ‌హీరో సిద్ధార్థ్ మల్హోత్రా బాంద్రా ఇంటికి డిన్న‌ర్ డేట్ కి వెళ్లింది.

ఇక కియ‌రా గత ఆదివారం కూడా సిద్ధార్థ్ తో డిన్న‌ర్ డేట్ కి వెళ్ల‌డంపై బాలీవుడ్ మీడియా లీకులు అందించింది. ప్ర‌స్తుతం ఈ జంట‌ విష్ణువర్ధన్ దర్శకత్వం లో కరణ్ జోహార్ నిర్మిస్తున్న షెర్షా చిత్రంలోనూ న‌టిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే ఏడాది కాలంగా ఈ ఇద్ద‌రిపైనా డేటింగ్ రూమ‌ర్లు షికార్ చేస్తున్నాయి. కియారా అద్వానీ ప్ర‌స్తుతం షేర్షా- భూల్ భూలైయా 2 - జగ్ జగ్ జీయో చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.