Begin typing your search above and press return to search.

మ‌హేష్ హీరోయిన్ ‌తో బాలీవుడ్ హీరో డేటింగ్‌!

By:  Tupaki Desk   |   26 Oct 2020 10:30 AM IST
మ‌హేష్ హీరోయిన్ ‌తో బాలీవుడ్ హీరో డేటింగ్‌!
X
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. `ల‌స్ట్ స్టోరీస్‌` నుంచి బాలీవుడ్‌ తో పాటు ద‌క్షిణాదిలోనూ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోయింది. తాజాగా మ‌ళ్లీ వార్త‌ల్లో నిలుస్తోంది. రూమ‌ర్డ్ బాయ్ ఫ్రెండ్ ‌లో క‌లిసి కియారా పోజులిచ్చిన ఫొటోలు ఇన్ ‌స్టాలో సంద‌డి చేస్తున్నాయి. కియారా అద్వానీ, ....హీరో సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా ఈ ఇద్ద‌రూ గ‌త కొంత కాలంగా డేటింగ్‌ లో వున్నారంటూ ఇటీవ‌ల వ‌రుస క‌థ‌నాలు వినిపించాయి.

అయితే ఈ వార్త‌ల‌పై ఈ ఇద్ద‌రు మండిప‌డ్డారు. తాము డేటింగ్ ‌లో లేమ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే అప్ప‌టి నుంచి వీర‌ద్దిరిపై నెటిజ‌న్స్‌,.. అభిమానులు ప్ర‌త్యేక అభిమానాన్ని చూపించ‌డం మొద‌లుపెట్టారు. తాజాగా వీరిద్ద‌రూ క‌లిసి `షేర్ ‌షా` చిత్రంలో న‌టిస్తున్నారు. `పంజా` ఫేమ్ విష్ణువ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. క‌ర‌ణ్ జోహార్‌ తో క‌లిసి మ‌రో ఐదుగురు నిర్మాత‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా రోజుల త‌రువాత కియారా.., సిద్ధార్ధ్‌ల ఫొటోల్ని ఇన్ స్టా వేదిక‌గా ఈ చిత్ర నిర్మాత‌లలో ఒక‌రైన షబ్బీర్ బాక్స్‌ వాలా షేర్ చేశారు.

సినిమాలో వీరిద్ద‌రి పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేశారు. సిద్ధార్ధ్ మ‌ల్హొత్రాని `షేర్‌ షా` చిత్రంలో విక్ర‌మ్ బాత్ర‌గా,... కియారా డింపుల్ చీమ‌గా న‌టిస్తున్న‌ట్టు ప‌రిచ‌యం చేశాడు. ట్రాక్ సూట్ ‌లో సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా.., క్యాజువ‌ల్ ఔట్‌ ఫిట్ ‌లో కియారా అద్వానీ క‌నిపించారు. దీంతో చాలా రోజుల త‌రువాత ఈ జోడీ న‌వ్వులు చిందిస్తూ క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.