Begin typing your search above and press return to search.
టైం కలిసిరావాలంటున్న మహేష్ హీరోయిన్
By: Tupaki Desk | 12 Jun 2017 12:58 PM ISTసినిమా ఇండస్ట్రీలో పైకి రావాలంటే బోలెడంత అందం.. కాస్తంత నటనతో పాటు కొంచెమైనా అదృష్టం ఉండాలి. సక్సెస్ ఇక్కడ గొప్ప గుర్తింపును తీసుకొస్తుంది. అందం.. అభినయం అన్నీ ఉన్నా సరైన సక్సెస్ వరించక లైమ్ లైట్ లోకి రాని వాళ్లెందరో ఉంటారు. ఆ కోవకే చెందుతుంది బాలీవుడ్ భామ కియారా అద్వానీ. హిందీ రొమాంటిక్ కామెడీ ఫిలిం ఫగ్లీతో ఈ సుందరి సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఇంపైన ఒంపుసొంపులతో మురిపించే ఈ మెరుపు తీగ ఎం.ఎస్.ధోనీ: యాన్ అన్ టోల్డ్ స్టోరీ, మెషిన్ సినిమాల్లో నటించింది.
కియారా అద్వానీ తాజాగా నటించిన మెషిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా హిట్టయితే బాలీవుడ్ వరస అవకాశాలు తలుపు తడతాయన్న ఈ భామ అంచనాలు తలకిందులయ్యాయి. ‘ఈ సినిమా విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మాట వాస్తవమే. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ అంతా ఎంతగానో శ్రమించింది. కెరీర్ ప్రారంభంలోనే అబ్బాస్-మస్తాన్ లాంటి దర్శకులతో పని చేయడం మరిచిపోలేని అనుభవం. కెరీర్ ప్రారంభంలోనే అలాంటి మంచి సినిమా చేయడం నిజంగా మంచి అవకాశం. కానీ ఆశించిన స్థాయిలో ఆ సినిమా ఆడలేదు. ఇది కొంచెం బాధపెట్టినా అంత మాత్రాన దిగాలేం పడిపోను’ అంటోంది కియారా.
‘నేను చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. నేను నటించిన మూడు సినిమాల్లోని అనుభవం ముందుముందు చేయబోయే సినిమాల్లో నా నటనను మెరుగు పరచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది’ అని కియారా తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెబుతోంది. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కియారా సౌత్ పై దృష్టి పెట్టింది. స్టార్టింగ్ లోనే మహేష్ బాబు సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. స్పైడర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించే సినిమాలో కియారాయే హీరోయిన్. చూడబోతే అదృష్టం ఈ భామ తలుపు తట్టినట్టే ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
