Begin typing your search above and press return to search.

మహేష్‌ హీరోయిన్ కు భలే అడ్వాంటేజ్

By:  Tupaki Desk   |   17 Jan 2018 9:53 AM GMT
మహేష్‌ హీరోయిన్ కు భలే అడ్వాంటేజ్
X
ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ల కొరతా ఉందా అంటే అవుననీ చెప్పలేం కాదనీ చెప్పలేం. అదిగో సమంత కూడా సీనియర్ అయిపోయింది అనుకున్నప్పుడు.. రకుల్.. రాశి ఖన్నా.. లావణ్య త్రిపాఠి ఉన్నారులే అనుకుంటే.. వారు కూడా ఫ్లాపులే కొడుతున్నారు. పోనివ్ అనుపమ పరమేశ్వరన్.. కీర్తి సురేష్‌.. అను ఎమ్మానుయేల్ వంటి మల్లూ భామలు ఉన్నారులే అనుకుంటే.. వారు ఈ మధ్యన కంగుతిన్నారులే.

నిజానికి అందరికంటే ఫాస్టుగా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ.. ఎన్నారై బ్యూటి అను ఎమ్మానుయేల్ స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్నారందరూ. ఆ సమయంలో ఆమెకు పవన్ అజ్ఞాతవాసి.. బన్నీతో నా పేరు సూర్య సినిమాలు రావడం.. పెద్ద ప్లస్సే అయ్యిందనే అనుకుంటే.. ఇప్పుడు అజ్ఞాతవాసి ఫ్లాప్ మైనస్ అయ్యేలా ఉంది. అజ్ఞాతవాసికి బ్యాడ్ టాక్ రాగానే.. ఈమెను తదుపరి సినిమాల్లోకి తీసుకుందాం అనుకున్న చాలామంది దర్శకులు.. కొరటాల శివ.. మహేష్‌ బాబు కాంబినేషన్లో వస్తున్న 'భరత్ అను నేను' హీరోయిన్ కియారా అద్వానీపై ఆసక్తి చూపుతున్నారట.

అసలు ఇప్పటివరకు మహేష్‌ సినిమా టీజర్ కూడా రానేలేదు కాబట్టి.. ఇక్కడ కియారా పెద్దగా పొడిచేసిందీ లేనిదీ అప్పుడే తెలియదు. కాని పక్క హీరోయిన్స్ పై ఫ్లాప్ టాక్ రావడంతో.. ఈ కొత్త హీరోయిన్ కు అది ప్లస్సవుతుంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. చరణ్‌-బోయపాటి మూవీ.. ఇలా ఆమెకు చాలా ప్రొడక్షన్ హౌసుల నుండి కాల్స్ వస్తున్నాయట. అది సంగతి.