Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : కాబోయే పెళ్లికూతురు కియ‌రా హాటెస్ట్ అవ‌తార్

By:  Tupaki Desk   |   4 Nov 2022 3:30 PM GMT
ఫోటో స్టోరీ : కాబోయే పెళ్లికూతురు కియ‌రా హాటెస్ట్ అవ‌తార్
X
ప్రియుడితో జంట షికార్లు చేస్తూ కూడా ల‌వ్ మ్యాట‌ర్ ని దాచిపెట్టినందుకు కియ‌రాపై అభిమానులు గుర్రుమీదున్నారు. ఇప్ప‌టికే సామాజిక మాధ్య‌మాల్లో నెటిజ‌నుల నుంచి సెగను ఎదుర్కొంటోంది. ప్ర‌తిసారీ నెటిజ‌నులు త‌న‌ని వెంబ‌డిస్తూ ప్రేమ పెళ్లిపై అదే ప్ర‌శ్న అడుగుతున్నారు. ప్రియుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో పెళ్లాడేదెపుడు? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అయితే అన్ని ప్ర‌శ్న‌ల‌కు ఈ ఏడాది చివ‌రిలో లేదా జ‌న‌వ‌రి త‌ర్వాత‌ స‌మాధానం ఇచ్చేందుకు.. పెడార్థాల‌కు చెక్ పెట్టేందుకు కియ‌రా-సిడ్ జోడీ మీడియా ముందుకు వ‌స్తార‌ని కూడా భావిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ జంట కూడా ఇత‌ర ప్రేమ‌ప‌క్షుల్లానే పెళ్లితో ఒక గూటికి చేర‌తార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇక పెళ్లికి ముందు కియ‌రా అద్వాణీ హాటెస్ట్ ఫోటోషూట్స్ అంత‌ర్జాలంలో సునామీ సృష్టిస్తున్నాయి. అభిమానుల‌లో ఇవి వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ పాక్షిక వ‌స్త్రాల్లో కియరా ఇచ్చిన ఫోజులు మంట‌లు రేపుతున్నాయి. వెబ్ లో కియ‌రా హాటెస్ట్ అవ‌తార్ ఇప్పుడు డిబేట‌బుల్ గా మారింది.

ఇంత‌కీ ఆమెలో ఎందుకింత క‌న్ఫ్యూజ‌న్?సిద్ధార్థ్ -కియారా అద్వానీ పెళ్లి వార్తలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో దావాన‌లంలా మారాయి. అభిమానుల్లో ప్ర‌స్తుతం ట్రెండింగ్ టాపిక్ ఇది. సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ బాలీవుడ్ లోని అత్యంత అంద‌మైన‌ జంటగా పాపుల‌ర‌య్యారు. గ‌త మూడు సంవత్సరాలుగా వారి డేటింగ్ గురించి పుకార్లు షికార్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ జోడీ పెళ్లి గురించిన రూమర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజా క‌థ‌నాల ప్రకారం.. ఈ జంట 2023 ఏప్రిల్ లో పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారంటూ ప్ర‌చారం సాగుతోంది.

కొంద‌రు సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరగనుందని సమాచారం. ఇలాంటి పుకార్ల న‌డుమ యువ‌హీరో సిద్ధార్థ్ మల్హోత్రా వ్యాఖ్య ఇంత‌కుముందు హాట్ టాపిక్ గా మారింది. ఈ జంట పెళ్లి ఢిల్లీలో కుటుంబసభ్యులు బంధువుల సమక్షంలో జరగనుందని క‌థ‌నాలొచ్చాయి. ఏప్రిల్ 2023లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారని పుకార్లు కూడా ఉన్నాయి. వివాహం తర్వాత దిల్లీ- ముంబైలో విడివిడిగా గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఆ ఇద్దరూ రిసెప్షన్ తర్వాత కాక్టెయిల్ పార్టీలో స‌న్నిహితులంద‌రితో సంద‌డి చేస్తారు.

మౌనం వీడ‌రు .. ఏదీ అంగీక‌రించ‌రు!సిద్ - కియారా త‌మ‌ సంబంధంపై ఎప్పుడూ మౌనం పాటించారు. ఇప్పుడు కూడా పెళ్లి పుకార్లకు సంబంధించి ఎటువంటి అధికారిక‌ ధృవీకరణను చేయ‌లేదు. ప్రేమికులు కానీ లేదా వారి ప్రతినిధులు కానీ దీనిపై ఇంకా ప్రస్తావించలేదు. కానీ తమ అభిమాన జోడి పెళ్లి గురించి ఫ్యాన్స్ ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. ఈ అంద‌మైన జంట‌ పెళ్లి చేసుకుని నిజ జీవిత జోడీగా మారాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాఫీ విత్ క‌ర‌ణ్ ఇచ్చిన లీకులు:ఇటీవల కియారా 'కాఫీ విత్ కరణ్' షోలో కనిపించింది . సిద్ధార్థ్ తో తాను అత్యంత స‌న్నిహితంగా ఉంటాన‌ని స్నేహితుడు మాత్ర‌మేన‌ని చెప్పింది. కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ అని కూడా హింట్ ఇచ్చేసింది. కానీ క‌ర‌ణ్ - షాహిద్ ఏడాది చివ‌రి నాటికి శుభ‌వార్త చెబుతారంటూ అస‌లు గుట్టు బ‌య‌ట‌పెట్టేసారు. ఇంత‌లోనే ఇప్పుడు ఏప్రిల్ 2023 లో ఈ జంట పెళ్లి జ‌ర‌గ‌నుందంటూ ప్ర‌చారం సాగుతోంది. ఓ ఇంట‌ర్వ్యూలో పెళ్లి గురించి దాచ‌లేం క‌దా! అంటూ సిద్ధూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు దుమారంగా మారింది. ''నేను నా చుట్టూ అందమైన వివాహాలను చూశాను.. నా జీవితంలో కూడా అలా జరుగుతుందని నేను వేచి చూస్తున్నాను.

అయితే అది ఎప్పుడు జరుగుతుందో నేను వెల్లడించను అని కియ‌రా ఇంత‌కుముందు అంది. ఇప్పుడు పెళ్లికి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. తాను కోరుకున్న ప్రియుడితోనే నిఖా ఖ‌రారైంద‌ని గుస‌గుస‌లు హీటెక్కిస్తున్నాయి. అయితే ఇరువ‌ర్గాల నుంచి అధికారికంగా దీనిపై ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డాల్సి ఉంటుంది. తాజా పుకార్ల న‌డుమ అంద‌మైన‌ ప్రేమ పక్షులకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైర‌ల్ గా మారుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.