Begin typing your search above and press return to search.

బ్రింజాల్ బ్యూటీ కియ‌రా స్ట‌న్నింగ్ లుక్

By:  Tupaki Desk   |   15 Aug 2021 1:30 PM GMT
బ్రింజాల్ బ్యూటీ కియ‌రా స్ట‌న్నింగ్ లుక్
X
ముంబై హాట్ గాళ్ కియారా అద్వాణీ అతి త‌క్కువ స‌మ‌యంలో అసాధార‌ణ స్టార్ డ‌మ్ ని ఆస్వాధిస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో వ‌రుస‌గా క్రేజీ చిత్రాల్లో న‌టిస్తున్న ఈ బ్యూటీ ఓవైపు సౌత్ లో అరుదైన అవ‌కాశాల్ని గుప్పిట ప‌డుతోంది. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఆర్సీ 15లో నాయిక‌గా ఎంపికై ఫుల్ జోష్ లో ఉంది.

ఇదే హుషారులో కియరా ఇప్పుడు సౌత్ పైనా ఫోక‌స్ చేయ‌నుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక కియ‌రా సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. అందాల కియ‌రా వ‌రుస ఫోటోషూట్ల‌తో అద‌ర‌గొడుతోంది. తాజాగా టైట్ ఫిట్ లో అందాల ఎలివేష‌న్స్ లోనూ కియరా ఇత‌ర భామ‌ల‌తో పోటీప‌డుతోంది. కెరీర్ పరంగా తెలివైన ప్ర‌ణాళిక‌ల‌తో కియ‌రా దూసుకుపోతున్న ఈ టైమ్ లో ప్రచార హంగామా ఆ స్థాయిలోనే ప్లాన్ చేస్తోంది. ఇక ఫిట్ నెస్ విష‌యంలో కియారా చాలా శ్ర‌ద్ద వహిస్తుంది. రెగ్యుల‌ర్ గా జిమ్...యోగా వంటివి దిన‌చ‌ర్య‌లో ఒక భాగం. నిరంత‌ర‌ ఫిట్ నెస్ వీడియోలను షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

తాజాగా కియ‌రా బ్రింజాల్ లుక్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. స్కిన్ టైట్ స్పోర్ట్ ట్రాక్ లో కెమెరా కంటికి చిక్కింది. ముంబైలో డాన్సు క్లాస్ ని ముగించికుని ఇంటికి వెళుతూ పార్కింగ్ లో కార్ వైపు న‌డుచుకుంటూ వెళుతున్న‌ స‌మ‌యంలో తీసిన కొన్ని ఫోటోలు వైర‌ల్ గా మారాయి. అందులో కియారా వంగ‌పువ్వు వ‌ర్ణంలో మెరిసిపోతోంది. టాప్ టు బాట‌మ్ కియ‌రా స్ట‌న్నింగ్ లుక్ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్‌ నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఇక కియారా సినిమాల విష‌యానికి వ‌స్తే బాలీవుడ్ లో రెండు..మూడు సినిమాల్లో న‌టిస్తోంది.తెలుగులో రామ్ చ‌ర‌ణ్ -శంక‌ర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం లో హీరోయిన్ గా ఎంపికైంది. అంత‌కు ముందు భ‌ర‌త్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా కియరా కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన విన‌య విధేయ రామ‌లోనూ న‌టించింది. కానీ ఆ సినిమా ఫ‌లితా నిరాశ‌ప‌రిచింది . మ‌ళ్లీ చెర్రీతో రెండో అవ‌కాశం అందుకుంది.