Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : చిగురు పచ్చ చీరలో సొగసు చూడ తరమా

By:  Tupaki Desk   |   5 Aug 2021 4:44 AM GMT
ఫొటోటాక్ : చిగురు పచ్చ చీరలో సొగసు చూడ తరమా
X
బాలీవుడ్‌ లో ఎంఎస్‌ ధోనీ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా దూసుకు పోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈమె చేతిలో అర డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నా కూడా బ్రాండ్‌ అంబాసిడర్ గా కూడా ఈమె పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తోంది. ఇక సోషల్‌ మీడియాలో ఈమె సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

చిగురు పచ్చ చీర కట్టులో ఈ అమ్మడి లుక్‌ అదిరి పోయిందంటూ అమ్మాయిలు సహా ఎంతో మంది కామెంట్స్ చేస్తున్నారు. సహజంగా హీరోయిన్స్‌ చీర కడితే క్లీ వేజ్‌ షో తో పాటు నడుము.. నాభి అందాలను చూపిస్తూ ఉంటారు. కాని ఈ ఫొటోలో కియారా మాత్రం ఏమాత్రం ఎక్స్‌ పోజింగ్ లేకుండా చాలా పద్దతిగా ఉందని.. అయినా కూడా సొగసు చూడ తరమా అన్నట్లుగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. సింప్లీ సూపర్‌ అంటూ ఉంటారు... దానికి ఈ ఫొటో లో కియారా నిదర్శణం అన్నట్లుగా నెటిజనస్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కియారా అద్వానీ ఫొటోకు అన్ని వర్గాల వారు ఫిదా అవుతున్నారు. ఇదే సమయంలో ఆమెను స్కిన్‌ షో లో కూడా చూసి ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. ఇక ఈమె సినిమాల  విషయానికి వస్తే హీరోయిన్‌ గా వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమా లు బ్యాక్ టు బ్యాక్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు లో ఈమె భరత్‌ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ తో శంకర్ తెరకెక్కించబోతున్న సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే శంకర్‌ టీమ్‌ లో ఈమె జాయిన్ అయ్యింది.