Begin typing your search above and press return to search.
కైరా అని పిలిచిన విలేకరిపై చిరాకు చూశారా?
By: Tupaki Desk | 15 Dec 2020 10:01 AM ISTటాలీవుడ్ బాలీవుడ్ లో భారీ క్రేజు ఉన్న నాయికగా కియరా అద్వాణీ పేరు మార్మోగుతోంది. ఇటు తెలుగులోనూ ఈ అమ్మడికి వీరాభిమానులున్నారు. బాలీవుడ్ లో కెరీర్ అత్యుత్తమంగా ఉందిప్పుడు. ఆ క్రమంలోనే తెలుగు సినిమాలకు సంతకం చేసే తీరికే చిక్కడం లేదు.
ప్రస్తుతం ఆమె కెరీర్‌లో ఉత్తమ దశను అనుభవిస్తున్న కియరా విషయంలో ఆ విలేకరి కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సింది. తెలిసో తెలియకో పదం సరిగా పలకడం కుదరకో అతడు `కైరా` అంటూ పిలిచేశాడు. ఇంకేం ఉంది.. దానికి కియరా ఏ రేంజులో క్లాస్ తీస్కుందో చూశారా? ఏమని పిలిచావ్? కైరా.. అయితే నీకు ఇంటర్వ్యూ లేదు. కియరా అని పిలిస్తేనే..! అంటూ విలేకరిని బోలెడంత ఆట పట్టించేసింది. ఇన్సిడెంట్ పై కాస్త వివరంగా చూస్తే.. “మీరు నన్ను ఏమని పిలిచారు? .. కైరా అని పిలిచారా.. కియారా అన్నారా? ” అంటూ తన పేరును తప్పుగా ఉచ్చరించడంతో అతని ప్రశ్నలకు సమాధానం ఇవ్వనని చెప్పింది కియరా. తనను కియారా అంటూ సరైన పద్ధతిలో పిలవమని ఉత్సాహం ప్రదర్శించింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అయితే ఇదంతా చాలా ఫన్నీగా మాత్రమే. కియరా ఎంతో జోష్ తో కనిపిస్తూ ఆ ఇంటర్వ్యూలో విలేకరుల ప్రశ్నలన్నిటికీ సమాధానాలిచ్చింది. వెళుతూ వెళుతూ తనని కైరా అని పిలిచిన విలేకరికి కొంటెగా భాయ్ చెప్పింది.
2014 కామెడీ-డ్రామా `ఫగ్లీ`తో తన బాలీవుడ్ ప్రయాణాన్ని ప్రారంభించిన కియరా ఈ ఆరేళ్ల జర్నీలో చాలా దూరం వచ్చింది. హిందీ చిత్రసీమలో వరుసగా అగ్ర హీరోల సరసన నటిస్తూ అగ్ర నాయికగా ఎదిగేసింది. ప్రస్తుతం తన కొత్త చిత్రం `ఇందూ కి జవానీ` ప్రచారంలో బిజీగా ఉంది. ఈ మూవీ 11 డిసెంబర్ న థియేటర్లలోకి విడుదలైంది. కానీ కరోనా కష్టం వల్ల ఎవరూ థియేటర్లకు రావడం లేదు. జనాన్ని రప్పించేందుకు చిత్రబృందం నానా ప్రయాసలు పడుతోంది. ఇక ఈ కార్యక్రమంలో కియరా విలేకరిపై కాస్తంత చిరాకు ప్రదర్శించినట్టే కనిపించినా అదంతా ఫన్నీ ఇన్సిడెంట్ మాత్రమే. ఇందూకి జవానీ లో ఆదిత్య సీల్ కథానాయకుడు. ఈ కామెడీ-డ్రామాకు అబీర్ సేన్ గుప్తా దర్శకత్వం వహించగా భూషణ్ కుమార్ నిర్మించారు.