Begin typing your search above and press return to search.

ఈమె క్రేజ్ మరింత పెరిగేలా ఉంది

By:  Tupaki Desk   |   7 May 2018 7:20 AM GMT
ఈమె క్రేజ్ మరింత పెరిగేలా ఉంది
X
టాలీవుడ్ లో బాలీవుడ్ భామల పరిచయాలు బాగానే సాగుతున్నాయి. ఒకప్పుడు సౌత్ సినిమాలంటే కాకరకాయ చేదు అన్నట్లు కామెంట్స్ చేసే భామలు ఇప్పుడు అదే ఆరోగ్యానికి మంచిదిని నటనలో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అనే విధంగా స్పందిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలతో ఏ మాత్రం అవకాశం వచ్చినా కూడా వదులుకోవడం లేదు. రిజల్ట్ సంగతి తరువాత ముందు ఇక్కడ ఒక స్టార్ డమ్ క్రియేట్ చేసుకున్నామా లేదా అనేదే ముఖ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల మహేష్ బాబు - భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ కైరా అద్వానీ. అమ్మడు సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లో కొంచెం డౌట్ అన్నట్లు అనిపించినా ఆ తరువాత ఫుల్ స్క్రీన్ పై చూసేసరికి అందరికి తెగ నచ్చేసింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో స్టార్ హీరోల చూపు ఈమెపై పడుతోంది. ఇక ఫొటో షూట్స్ తో తనకున్న క్రేజ్ ను కైరా మరింత పెంచుకుంటోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన కొన్ని ఫొటోలు టాలీవుడ్ ఆడియెన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి.

డిఫరెంట్ ఫ్యాషన్ లుక్ లో తన సొగసులను సరికొత్తగా ప్రజెంట్ చేసింది. లెగ్స్ అందాలు ఓర చూపులకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. చూస్తుంటే అమ్మడు సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ కి పోటీ గట్టిగానే ఇచ్చేలా ఉంది. ప్రస్తుతం కైరా అద్వానీ రామ్ చరణ్ - బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.