Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఫాలోవర్స్ కోసం హాటుగా

By:  Tupaki Desk   |   1 March 2018 12:20 PM GMT
ఫోటో స్టోరి: ఫాలోవర్స్ కోసం హాటుగా
X
కైరా అద్వానీ నక్కతోక తొక్కినట్టు కనిపిస్తోంది. అందుకే నేరుగా మహేష్ పక్కనే హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. అంతకుముందు ఆమె ఎవరో తెలుగు ప్రేక్షకులకు తెలియదు. భరత్ అను నేను సినిమా విడుదలకు దగ్గరవుతున్న కొద్దీ... కైరాఅద్వానీ రెచ్చిపోతోంది.

మొన్నటికి మొన్న మనసుకు నచ్చింది అంటూ సందీప్ కిషన్ తో ఓ సినిమా చేసింది. అది కాస్త అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ సినిమాలో ఆమె పాత్రకు కాస్త మంచి పేరే వచ్చింది. ఏప్రిల్లో భరత్ అను నేను సినిమా ద్వారా మహేష్ బాబు పక్కన మెరవబోతోంది. ఎంతైనా మహేష్ బాబు పక్కన హీరోయిన్ అంటే మాటలా? ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేస్తుంది. ఇదిగో ఇప్పుడూ అదే జరిగింది. కైరా అద్వానీకి ఏకంగా పదిలక్షల మంది ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చారు.

ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అమ్మడు ఊరుకుంటుందా? అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది. అవకాశం వచ్చినప్పుడల్లా క్లీవేజ్ షోలకు ఏమాత్రం వెనుకాడడంలేదు. తాజాగా ఆమె ఇన్ స్ట్రాగ్రామ్ లో పెట్టిన ఫోటో నెటిజన్లను రెచ్చగొడుతోంది. సోషల్ మీడిమాలో తన ఫోటోలతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆమె హాట్ ఫోటోస్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయ్.