Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: డ్రీమ్ గర్ల్.. డ్రీమ్ లొకేషన్..

By:  Tupaki Desk   |   5 Oct 2019 5:58 AM GMT
ఫోటో స్టోరీ: డ్రీమ్ గర్ల్.. డ్రీమ్ లొకేషన్..
X
కియారా అద్వాని బాలీవుడ్ భామే కానీ రెండు టాలీవుడ్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. ఈమధ్య హిందీ సినిమాలతో బిజీ కావడంతో తెలుగు సినిమాలకు దూరమైంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ భామ సోషల్ మీడియాలో అప్డేట్లు ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ఈమధ్య బుకింగ్ కామ్ అనే ట్రావెల్ ఏజెన్సీకి బ్రాండ్ అంబాజిడర్ గా మారింది. దీంతో వెకేషన్ ఫోటోలను ప్రమోషన్ ను రంగరించి మరీ పోస్టులు పెడుతోంది.

ఈమధ్యే బుకింగ్ కామ్ వారి సౌజన్యంతో కియారా తన కుటుంబంతో కలిసి యూరోప్ ట్రిప్ వేసింది. అక్కడ ఒక యాడ్ షూటింగ్ లోపాల్గొంది. పనిలో పనిగా ఫ్యామిలీ ఫుల్ గా ఎంజాయ్ చేసి ముంబైకి తిరిగొచ్చింది. అయితే వెంటనే ట్రిప్ హ్యాంగోవర్ నుంచి బయటకు రాలేరు కదా.. అందుకే తిరిగివచ్చిన తర్వాత ఊరుకోకుండా నెక్స్ట్ వెకేషన్ గురించి ఇప్పటి నుంచే అలోచిస్తున్నాను అని చెప్తూ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ప్రతి 4 నెలలకు ఒక వెకేషన్ కు వెళ్తే ఎంత బాగుంటుందో.. ఫుల్ గా రిఫ్రెష్ అవుతాం.. రీఛార్జ్ అవుతామంటూ నెటిజన్లకు పర్యాటక సందేశం ఇచ్చింది. అందుకు బుకింగ్ కామ్ ను ఫుల్ గా వాడుకోండి అని చెప్తోంది. ఇక ఫోటో విషయానికి ఈ భామ ఇటలీ దేశంలోని లేక్ కోమోను సందర్శించిన సమయంలో తీసుకున్న ఫోటో. అద్భుతమైన సీనరీ ఉన్న లొకేషన్ కాబట్టి ఆటోమేటిక్ గా వెకేషన్ అదిరిపోయి ఉంటుంది. పూల డిజైన్ ఉన్న ఒక స్లీవ్ లెస్ గౌన్ ధరించి బాల్కనీలో నిలుచుని పైకి చూస్తూ కిలకిలా నవ్వుతోంది. తలపై స్టైల్ గా పెట్టుకున్న గాగుల్స్.. చెవులకు లవ్ సింబల్ లాగా ఉన్న ఇయర్ రింగ్స్.. అన్నీ సూపరే.

ఈ ఫోటోకు వన్ మిలియన్ కు పైగా లైక్స్ వచ్చాయి. "ఆయ్ హాయ్ క్యూటీ".. "ట్రూలీ బ్యూటిఫుల్".. "డ్రీమ్ గర్ల్.. డ్రీమ్ లొకేషన్" అంటూ నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే కియారా 'గుడ్ న్యూస్'.. 'లక్ష్మి బాంబ్'.. 'ఇందు కీ జవాని' సినిమాల్లో నటిస్తోంది