Begin typing your search above and press return to search.

ధోనితో డేట్.. విరాట్ హాట్

By:  Tupaki Desk   |   15 Oct 2017 7:13 AM GMT
ధోనితో డేట్.. విరాట్ హాట్
X
బాలివుడ్ స్వీట్ బ్యూటీ కైరా అద్వానీ ఇప్పటివరకు చేసింది మూడు సినిమాలే అయినా అందంలో క్రేజ్ ను బాగానే సంపాదించుకొంది. ఫాన్స్ లో కూడా తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే రీసెంట్ గా కైరా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ధోని గురించి కొన్ని కామెంట్స్ చేసి అందరిని ఆకర్షించింది. అమ్మడు ధోని బయోపిక్ 'ధోనీ: ద అన్‌టోల్డ్‌ స్టోరీ' సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అందులో ధోని వైఫ్ సాక్షి పాత్రలో కనిపించి అందరిని మెప్పించింది.

ఇక అసలు విషయానికి వస్తే కైరా ధోనీతో డిన్నర్ డేట్ కు వెళ్లాలని చాలా కొరికగా ఉందని అంటోంది. ధోనీకి పెళ్లైంది. అతను తన కుటుంబంతో చాలా ప్రేమగా ఉంటాడు. క్యాండిల్ డిన్నర్ ఏంటో నాకు తెలియదు. కానీ అవకాశం వస్తే నా స్టైల్ లో ధోనీని డిన్నర్ డేట్ కి తీసుకెళతానని చెప్పింది. ధోని ఎంతో ఇష్టమని చెబుతూ.. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. అందుకే ఎంతో అభిమానమని వివరించింది. అదే విధంగా కోహ్లీపై కూడా కైరా కొన్ని కామెంట్స్ చేసింది.

మన ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. విరాట్ కోహ్లీ చాలా హాట్ గా ఉంటాడని చెప్పేసింది. ప్రస్తుతం విరాట్ అనుష్క ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా అల్ రెడీ సెట్ అయిన వాళ్లపైనే కైరా రొమాంటిక్ కామెంట్స్ చేస్తోంది. మరి తన మనసుకి ఇష్టమైన రాకుమారుడి గురించి అమ్మడు ఎప్పుడు డేట్ కి వెళుతుందో అని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కైరా మహేష్ బాబు -కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను సినిమాలో నటిస్తోంది.