Begin typing your search above and press return to search.

మహేకి జోడీగా.. ఆ బాలీవుడ్ బ్యూటీ

By:  Tupaki Desk   |   6 April 2017 6:35 AM GMT
మహేకి జోడీగా.. ఆ బాలీవుడ్ బ్యూటీ
X
మహేష్ బాబు కొత్త సినిమా మొదలుపెడుతున్నాడు అనగానే.. హీరోయిన్ గా అనేక మంది పేర్లు వినిపించేస్తూ ఉంటాయి. బాలీవుడ్ హీరోయిన్స్ ను పట్టుకొచ్చేస్తున్నాడనే టాక్ ప్రతీసారి వినిపిస్తూనే ఉంటుంది. దీపికా పదుకొనేతో సహా ఎవరినీ వదలకుండా.. ఆ టైంకి ఎవరు ట్రెండింగ్ హీరోయిన్ అయితే.. ఆ పేర్లు చక్కర్లు కొడుతూ ఉంటాయి.

మురుగదాస్ మూవీని పూర్తి చేసేస్తున్న సూపర్ స్టార్.. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ అంటూ.. ఇప్పటికే పరిణీతి చోప్రా.. దిశా పటానీల పేర్లు వినిపించాయి. ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. ఎంఎస్ ధోని-ది అన్ టోల్డ్ స్టోరీతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన కైరా అద్వానీని పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అసలు మహేష్ సరసన కొత్తమ్మాయి అనే టాక్ ముందు వినిపించింది. ఇప్పుడు రేస్ లోకి కైరా అద్వానీ వచ్చిందని అంటున్నారు.

అయితే.. బాలీవుడ్ భామలతో చేసిన గత చిత్రాలు ఫెయిల్ అవడంతో.. మహేష్ మాత్రం సాధారణంగా ఇక్కడి స్టార్ భామలతో సినిమాలు చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. చాలాసార్లే ఇలా జరిగినా.. ప్రతీసారి మహేష్ కొత్త సినిమా అనగానే.. బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు వినిపిస్తుంటాయి. చూద్దాం.. ఈసారి మహేష్ ఏం చేస్తాడో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/