Begin typing your search above and press return to search.

చీజ్ బడీ అంటున్న బన్నీ భామ

By:  Tupaki Desk   |   6 March 2017 4:25 PM GMT
చీజ్ బడీ అంటున్న బన్నీ భామ
X
ఎంఎస్ ధోనీ.. ది అన్ టోల్డ్ స్టోరీ చిత్రంతో దేశవ్యాప్తంగా పేరు దక్కించుకున్నవారిలో కైరా అద్వానీని కూడా చెప్పుకోవాలి. ఇప్పుడీమె కోసం అనేక ఇండస్ట్రీల నుంచి ఎంక్వైరీలు జరిగిపోతున్నాయి. వక్కంతం వంశీతో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న మూవీకి.. ఈ భామనే ఫిక్స్ చేశారనే టాక్ జోరుగా ఉంది.

ఇప్పుడీ కైరా అద్వానీ.. ఓ బాలీవుడ్ క్లాసిక్ సాంగ్ కి లేటెస్ట్ రీమేక్ లో డ్యాన్స్ వేసి ఆకట్టుకుంది. మొహ్రా మూవీలో అక్షయ్ కుమార్- రవీనా టాండన్ లు 'తు చీజ్ బడీ హై మస్త్ మస్త్' అంటూ సాగే పాటలో ఇరగదీసేస్తారు. ఆ తర్వాత 2005లో ఈ పాటను ఓ సారి రీమేక్ చేయగా.. ఇప్పుడు వీడియో సాంగ్ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. లిరిక్ వరకూ తీసుకున్నా.. అది కూడా కొంచెం మార్చి.. థీమ్ మార్చి పిక్చరైజ్ చేశారు.

విచిత్రం ఏంటంటే.. ఈ మూడు సార్లు మేల్ సింగర్ ఉదిత్ నారాయణ్ కావడమే. ఈ లేటెస్ట్ వెర్షన్ ను కూడా ఉదిత్ పాడడంతో.. మరింత ఆకట్టుకుంటుంది. మరోవైపు డ్యాన్సులు విషయంలోనూ.. స్కిన్ షో విషయంలోనూ కైరా అద్వానీ బాగానే ఆకట్టుకుంది. సూపర్ హిట్ క్లాసిక్ ఐటెం సాంగ్ కావడంతో.. ఈ పాటకు ఆన్ లైన్ లో క్రేజ్ బాగానే ఉంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/