Begin typing your search above and press return to search.

కియరా అను నేను.. కటింగులో బిజీ

By:  Tupaki Desk   |   2 July 2017 5:19 AM GMT
కియరా అను నేను.. కటింగులో బిజీ
X
ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఎదురు చూసే సినిమాలలో ‘భరత్ అను నేను’ సినిమా ఒకటి. మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. కొరటాల శివ ఈ సినిమా కోసం పక్కా ప్లాన్ వేశాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతికి సినిమాగా థియేటర్లలో పండుగ జరుపుకోవచ్చు. ఈ సినిమాతో ఒక బాలీవుడ్ భామ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. కియరా అద్వానీ అనే అమ్మాయి మహేశ్ బాబు కి జంటగా నటిస్తోంది.

ఇప్పుడు కియరా షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే ఉంటుంది. ఇంకా తెలుగు ప్రజలకు ఈమె ఎవరో తెలియకుండానే మహేశ్ బాబు హీరోయిన్ అనే టాగ్ తో షోరూమ్స్ కు వెళ్ళి ఓపెనింగ్ రిబ్బన్స్ కట్ చేస్తోంది కూడాను. మహేష్‌ 'భరత్ అను నేను' సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి షూటింగ్ అయ్యాక ఖాళీగా ఉండకుండా స్టోర్ లాంచ్ అంటూ ఇలా సైడ్ బిజినెస్ నలు చేసుకోవడం అంటే.. ఆమె పి.ఆర్. టీమ్ ను అభినందించాల్సిందే. అమ్మాయి కూడా కొంచం న్యూ ఫేస్ కాబట్టి చూసే వాళ్ళకు కొత్తగా ఉంటుంది అని భావించి అప్పుడే ఆహ్వానాలు కూడా అందుతున్నాయటలే. నిన్ననే హైదరాబాదులో ఒక స్టోర్ లాంచ్ లో అమ్మడు సందడి చేసింది.

హిందీలో ‘ఫగ్లీ’ అనే సినిమా తో పరిచయమైన కియరా అద్వానీ ఆ తరవాత ఎమ్. యెస్. ధోని సినిమాలో సాక్షి సింగ్ పాత్రలో మెరిసింది. ఇప్పుడు తెలుగులో డైరెక్ట్ గా మహేశ్ సరసన నటిస్తోంది. మొదటి సినిమా తోనే స్టార్ హీరోయిన్ కాబోతుంది ఏమో చూడాలి. ​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/