Begin typing your search above and press return to search.

కియారా చేజార్చుకున్న బంపర్ ఆఫర్ రెజీనా చేతికి

By:  Tupaki Desk   |   26 July 2021 3:33 AM GMT
కియారా చేజార్చుకున్న  బంపర్ ఆఫర్ రెజీనా చేతికి
X
తెలుగులో తక్కువగా.. తమిళంలో భారీ ఎత్తున సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న హాట్ బ్యూటీ రెజీనా కసండ్రా. తెలుగులో ‘ఎవరు’ తర్వాత ఆమె సినిమాలు మరేమీ విడుదల కాలేదు. తాజాగా ఆమె ఆచార్యతో పాటు రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో దాదాపునాలుగైదు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. తెలుగులో అవకాశాలు దక్కించుకోవటంలో వెనుకబడిన ఆమెకు.. కోలీవుడ్ అండగా నిలుస్తోంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె పదహారేళ్లు పూర్తి చేసుకున్నా.. తన క్రేజ్ మాత్రం తగ్గకుండా చూసుకోవటంలో సక్సెస్ అవుతున్నారు.

తెలుగు.. తమిళం.. కన్నడ.. హిందీ సినిమాల్లో నటించే రెజీనా ఎక్కువ సినిమాలు చేసింది మాత్రంకోలీవుడ్ లోనే. ఎంట్రీ ఇచ్చిన తమిళ చిత్రాలకే ఆమెకు అవకాశాలు బాగా వస్తున్నాయి. తమిళంతో పోలిస్తే.. తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గాయి. ఇలాంటివేళ.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీలో నటిస్తున్నారు. ఆమె కెరీర్ మొత్తంలో 2013, 2014, 2015, 2016లలో చాలా ఎక్కువగా తెలుగు సినిమాలు చేసింది. ఆ తర్వాత ఆమెకుతమిళంలోనే ఎక్కువ అవకాశాలు రావటం గమనార్హం.

2018లో హిందీలో ‘ఎక్ లడకీ కో దేఖాతో ఐసా లగా’ చిత్రంలో చేసినా ఆమెకు తర్వాతి అవకాశాలేమీ రాలేదు. అలాంటి ఆమెకు తాజాగా హిందీలో ఒక బంఫర్ ఆఫర్ వచ్చినట్లుగా చెప్పాలి. ప్రస్తుతం చేతి నిండా తమిళ సినిమాలు ఉన్న రెజీనాకు.. బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న హిందీ ఛత్రపతి మూవీలో ఆమెకు అవకాశం తలుపు తట్టింది. వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న హిందీ రీమేక్ ఛత్రపతిలో రెజీనా నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ఛత్రపతిని.. హిందీ నేటివిటీకి కొన్ని మార్పులు చేసి నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో దీని షూటింగ్ ఆరంభమైంది. ఒరిజినల్ తెలుగులో శ్రియ నటించిన పాత్రను రెజీనా హిందీలో చేయనున్నారు.

వాస్తవానికి ఈ పాత్ర కోసం కియారా అద్వాణీని తొలుత అనుకున్నారు. కానీ.. ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవటంతో అవకాశం రెజీనాను వెతుక్కుంటూ వెళ్లింది. తాజా అవకాశంతో హిందీలో తన లక్ ను మరోసారి రెజీనా పరీక్షించుకోనుందని చెప్పక తప్పదు.