Begin typing your search above and press return to search.

భరత్ బ్యూటీ ఫిదా చేసిందే!!

By:  Tupaki Desk   |   5 Feb 2018 10:15 AM GMT
భరత్ బ్యూటీ ఫిదా చేసిందే!!
X
నార్త్ భామల హవా టాలీవుడ్ లో ఎప్పటి నుంచో వస్తున్నదే. కానీ బాలీవుడ్ లో నటించిన నార్త్ హీరోయిన్స్ తెలుగులో రావడం అంటే ఒకప్పుడు రిస్క్ తో కూడుకున్న పని అని ఓ టాక్ ఉండేది. బాలీవుడ్ అందాలను తెలుగు వారు ఆక్సెప్ట్ చేస్తారా అనేది ఒక సందేహమే. కానీ కరెక్ట్ గా వారికి తగ్గట్టు మారితే క్లిక్ అయిపోతారు అని ఈ మధ్య నార్త్ బామలు ఆ తరహాలో వారి అందాల పద్దతులను మార్చుకుంటున్నారు.

బాలీవుడ్ స్టార్స్ కంటే మన స్టార్స్ ఏ మాత్రం తక్కువ కాదు అనే జ్ఞానోదయం రావడంతో వెంటనే టాలీవుడ్ ప్రాజెక్టులకు ఒకే చేపిస్తున్నారు. ఆ తరహాలో టాలీవుడ్ సూపర్ స్టార్ సినిమాలో నటిస్తోన్న బ్యూటీ కైరా అద్వానీ. మహేష్ - భరత్ అనే నేను సినిమాలో ఈ సెక్సీ బ్యూటీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఆ సినిమాలో కనిపించిన లుక్ ఎలా ఉంటుందో తెలియకపోయినప్పటికీ అమ్మడు మహేష్ సరసన కరెక్ట్ గా సెట్ అవుతుంది అనే విధంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకు రీసెంట్ గా ఇచ్చిన ఒక ఫొటో షూట్ తో చెప్పకనే చెప్పింది. లాక్మి ఫ్యాషన్ వీక్ కు వెళ్లిన కైరా అక్కడ ప్రీ ఫోటో షూట్ లో తన అందాలను చాలా ఘాటుగా చూపించేసింది.

మొన్నటి వరకు నార్త్ లోనే అమ్మడి ఫొటోలు వైరల్ అయ్యేవి. ఇక ఇప్పుడు మహేష్ సినిమాలో నటిస్తుండడంతో టాలీవుడ్ ప్రేక్షకులు కూడా కైరా అందాలకు ఫిదా అవుతున్నారు. క్లివేజ్ అందాలను నాభి అందాలను ప్రేమగా చూపిస్తూ.. అభిమానుల మనసును దోచేసుకుంటోంది. ఈ లెక్కన చుస్తే తప్పకుండా కైరా కోసం కూడా సినిమాలకు వెళ్లాలని ఓ వర్గం అభిమానులు కామెంట్ చేస్తున్నారు.