Begin typing your search above and press return to search.

కి అండ్ కా.. రొమాన్స్‌ తో దంచేశారంతే

By:  Tupaki Desk   |   15 Feb 2016 1:34 PM GMT
కి అండ్ కా.. రొమాన్స్‌ తో దంచేశారంతే
X
కి అండ్ కా అనే టైటిల్ తో బాలీవుడ్ లో ఓ మూవీ తెరకెక్కింది. ఆర్. బల్కి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో కరీనా తన విశ్వరూపం చూపించబోతోంది. ప్రస్తుత భారత సమాజానికి రివర్స్ కోణంలో వెళ్తే ఎలా ఉంటుందన్నదే ఈ సినిమా. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే.. తన తల్లిలాగా హౌజ్ వైఫ్ అవ్వాలని అనుకుంటాడు హీరో అర్జున్ కపూర్. కార్పొరేట్ రంగంలో సీఈఓగా ఎదిగిపోవాలన్నదే హీరోయిన్ కరీనా కోరిక. ఈ జంట ఆన్ స్క్రీన్ పై చేసిన హంగామానా కీ అండ్ కా.

ఏప్రిల్ 1న రిలీజ్ కానున్న కీ అండ్ కా ట్రైలర్ రిలీజ్ అయింది. కాన్సెప్ట్ తోనే ఆసక్తి కలిగించిన ఈ మూవీ ట్రైలర్ ని.. అంత కంటే క్లియర్ గా రూపొందించారు. పెళ్లిచూపుల్లోనే ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం, కరీనాకు భార్యగా(మీరు చదివింది కరెక్టే) రావాలని అనుకుంటున్నట్లు చెప్పడం, ఇల్లు చూసుకునే బాధ్యత హీరోది, బైటకెళ్లి సంపాదించే పని హీరోయిన్ ది. ఇల్లు గడవాలంటే డబ్బులివ్వు అని హీరో అనడం, రెస్టారెంట్ లో బిల్ ని కరీనా వైపు తోయడం లాంటి సీన్స్ బాగా క్యాచీగా ఉన్నాయి.

ఇక ఈ మూవీలో అన్నిటికంటే చెప్పుకోవాల్సింది కరీనా కపూర్ గురించే. పెళ్లయ్యాక బెబా ఇంతగా రెచ్చిపోయిన సినిమా ఇప్పటివరకూ లేదు. లిప్ కిస్సులు - వాటేసుకోవడాలు, బెడ్ రూమ్ సీన్స్ లో మీద పడిపోవడం.. అబ్బో మళ్లీ పదేళ్ల క్రితం కరీనాని గుర్తు చేస్తూ.. రొమాన్స్‌తో దంచేశారు.. మొత్తానికి కి అండ్ కా మీద ఇప్పుడొచ్చిన ట్రైలర్ అంచనాలు పెంచేసింది.

Watch Here: http://erosnow.com/#!/movie/watch/1047825/ki-and-ka/6679644/exclusive---official-trailer