Begin typing your search above and press return to search.
సుహానాతో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ- సైఫ్ కొడుకు ఇబ్రహీం డెబ్యూలుగా
By: Tupaki Desk | 19 Aug 2021 1:15 PM ISTకింగ్ ఖాన్ షారూక్ వారసురాలు సుహానా ఖాన్ కథానాయికగా ఆరంగేట్రం చేస్తోందని కథనాలొస్తున్నాయి. ప్రముఖ దర్శకురాలు జోయా అక్తర్ రూపొందించనున్న నెట్ ఫ్లిక్స్ సిరీస్ తో సుహానా డెబ్యూ నాయికగా తెరకు పరిచయమవుతోందని త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తారని ఇంతకుముందు గుసగుసలు వైరల్ అయ్యాయి.
ఇంతలోనే మరో ఇద్దరు స్టార్ కిడ్స్ ని కూడా జోయా అక్తర్ ఆడిషన్స్ చేసి ఎంపిక చేసుకున్నారని కథనాలొస్తున్నాయి. అందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్.. అతిలోక సుందరి శ్రీదేవి- బోనీ కపూర్ ల రెండో కుమార్తె ఖుషీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. జోయా అక్తర్ నెట్ ఫ్లిక్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా పాపులరైన ఆర్కిస్ కామిక్స్ ఆధారంగా దేశీ సిరీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జోయా ఇప్పటికీ తన దేశీ `ఆర్చీ`ని వెతుకుతూ.. అప్పటికే ఆమె బెట్టీ .. వెరోనికా పాత్రధారులను కనుగొన్నారని కథనాలొస్తున్నాయి. ఈ సిరీస్ లో ఖుషీ కపూర్ & సుహానా ఖాన్ లను వెరోనికా గా.. బెట్టీగా పరిచయం చేయబోతున్నారు. ఆర్చీ పాత్రలో ఇబ్రహీం అలీ ఖాన్ నటిస్తారని ప్రచారమవుతోంది.
ఈ సంవత్సరంలో ఇది గొప్ప కాస్టింగ్ ఎంపిక. ఇద్దరు స్టార్ డాటర్స్ బాలీవుడ్ లో ఎప్పుడు లాంచ్ అవుతారనే దానిపై ఎప్పటినుంచో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. నిజానికి జాన్వీని ధడక్ చిత్రంతో తెరకు పరిచయం చేసిన కరణ్ జోహార్ ఖుషీని కూడా పరిచయం చేస్తారని భావించారు. కానీ ఇప్పుడు జోయాకు ఆ అవకాశం వెళ్లింది.
నెట్ ఫ్లిక్స్ సిరీస్ కి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. జోయా అక్తర్ సిరీస్ లో సైఫ్ అలీ ఖాన్ -అమృత సింగ్ కుమారుడు ఇబ్రహీం ఆర్చీ పాత్ర పోషించే బలమైన అవకాశం ఉండగా.. ఖుషీ కి మంచి స్కోప్ దొరుకుతుందని ఊహాగానాలు ఇప్పటికి సాగుతున్నాయి. వీటిని అధికారికం చేయాల్సినది జోయా మాత్రమే.