Begin typing your search above and press return to search.

జాన్వి బాటలోనే ఖుషీ..

By:  Tupaki Desk   |   25 July 2018 5:30 PM GMT
జాన్వి బాటలోనే ఖుషీ..
X
దివంగత నటి శ్రీదేవికి తన కూతుళ్లను స్టార్ హీరోయిన్లుగా చేయాలనే గొప్ప ఆశ ఉండేది. ఆ ప్రయత్నాల్లో ఉండగానే ఆమె తనువు చాలించింది. శ్రీదేవి చనిపోయాక ఆమె పెద్ద కూతురు జాన్వి నటించిన బాలీవుడ్ చిత్రం ‘ధడక్’ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యి గ్రాండ్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. తల్లి లాగే జాన్వీ కూడా కళ్లతోనే భావాలు పలికించిందని.. జూనియర్ శ్రీదేవి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికర వార్త శ్రీదేవి అభిమానులకు ఆనందాన్ని పంచింది.

శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా సినిమాల్లోకి రాబోతోందని సమాచారం. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన శ్రీదేవి భర్త బోనీకపూర్ తన చిన్న కూతురు ఖుషీ తాను కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతోందని తెలిపాడు. ‘ఖుషీ మొదట మోడలింగ్ చేయాలనుకుంది. అక్క జాన్వీ హీరోయిన్ గా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడంతో ఖుషీ మనసు మారింది. తాను డైరెక్ట్ గానే హీరోయిన్ కావాలనుకుంటోంది.కెరీర్ గురించి అప్పుడే నిర్ణయం తీసుకుంది.. అన్షులా - అర్జున్ - జాన్వీల బాటలోనే సినిమాల్లో రాణించాలనుకుంటోంది.. ’ అని బోనీకపూర్ వ్యాఖ్యానించాడు. దీంతో శ్రీదేవి రెండో కూతురు కూడా ఎంట్రీ ఖాయమని అర్థమైంది. శ్రీదేవిని మరిపించే సత్తా మరి జాన్వీకి ఉందా.? లేదా ఖుషీకి ఉందా తెలియాలంటే కొన్నేళ్ల వరకూ ఆగాల్సిందే..